1, జనవరి 2024, సోమవారం

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 8*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*శ్లోకము 8*

 *భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ*

 *కృపశ్చ సమితింజయః ।*

*అశ్వత్థామా వికర్ణశ్చ*

*సౌమదత్తిస్తథైవ చ ।।*

 

(భవాన్ — భీష్మః — చ — కర్ణః— చ — కృపః — చ — సమితింజయః — అశ్వత్థామా —వికర్ణ — చ — సౌమదత్తిః  — తథా — ఏవ — చ)

 

భవాన్ — స్వయంగా మీరు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; సౌమదత్తిః  — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ —  మరియు.

 

*భావము:*

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.                *శ్లోకము 9*


*శ్లోకము*

*అన్యే చ బహవః శూరా*

 *మదర్థే త్యక్తజీవితాః ।*

*నానాశస్త్ర ప్రహరణాః*

*సర్వే యుద్ధవిశారదాః ।।*

 

అన్యే — ఇతరులు; చ 

బహవః — చాలామంది; 

శూరాః  — వీర యోధులు; 

మదర్థే — నా కోసం; 

త్యక్త-జీవితాః  — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; 

నానా-శస్త్ర ప్రహరణాః  — అనేక ఆయుధములు కలిగినవారు; 

సర్వే — అందరూ; 

యుద్ధ-విశారదాః  — యుద్ద రంగంలో నిపుణులు..

 

*భావము:*

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷


🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 10*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।*

*పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।।*


 

*భావము:* 

మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే రక్షింపబడుచున్న పాండవసైన్యం పరిమితమైనది.


*వివరణ:*

దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్య  కాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది.

భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధ శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు,  భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలం తో పోల్చాడు. కానీ, భీష్ముడు కౌరవులకి, పాండవులకీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ వున్న ఈ పవిత్రయుద్ధంలో,  భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి, కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవులతో  ప్రతిపక్షంలో యుద్ధం చేయటానికి నిశ్చయించాడు. ఈ నిర్ణయం భీష్ముడి నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: