🙏దశావతారాలు🙏
👉మాతృమూర్తి గర్భంలో ఈదుతూ ఎదిగే "మత్స్యం"
నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక "కూర్మం"
వయసులోని జంతు ప్రవర్తన ఒక "వరాహం"
మృగం నుంచి మనిషిగా మారే దశ "నరసింహం"
మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు "వామనుడు"
ఎదిగినా క్రోధం తగదని తేలిస్తే వాడు "పరశురాముడు"
సత్యం, ధర్మం, శాంతి ప్రేమలతో తానే ఒక "శ్రీరాముడు"
విశ్వమంతా తానే అని విశ్వసిస్తే నాడు "శ్రీకృష్ణుడు"
ధ్యానియై, జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక "బలరాముడు"
కర్తవ్య మొనరించి జన్మసార్ధకతతో కాగలడు. కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం.. మలుచుకుంటే జన్మ ఒక్కటిలోనే మనిషి దశావతారం.
ఒకరకంగా దశావతారాలు మానవ పరిణామక్రమం (evolution)ని సూచిస్తాయి. మనిషి ఎదుగుతున్న కొద్ది మార్పు రావాలి అనేది నీతి.
ఒక్కొక్క యుగానికి ఒకొక్క అవతారంలో ఎలా బ్రతకాలో చూపించిన భగవంతుడు.
ఈ కలియుగంలో ఎలా బ్రతకాలో మాత్రం మరిచాడు ఎందుకో.!?! అనే అనుమానం కూడా రావచ్చు.
అలాంటి అనుమానం అక్కర్లేదనే తిరుమలలో పద్మ పీఠం మీద మౌనంగా నిల్చున్న శ్రీనివాసుడు తెలియచేస్తాడు. కానీ అయన మౌనంగా ఉంటాడా? అంటే మౌనంగా ఉంటూనే తన పని తాను చేస్తాడు. మౌనంగా ఉన్నట్టు ఉంటాడు అంతే. అది రాతి విగ్రహం అని పోరబడితే అది మన అజ్ఞానం. స్వయంగా స్వామి అక్కడ నిల్చున్నాడు అని అనుకుంటేనే మనకు ఫలితం.
*దశావతారాలు🙏*
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి