20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

గురువులకు

 🌸గురువులకు నమస్కారములు🙏🙏🙏


నేను డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ని  ఒకరోజు కాలేజీలో పాఠము చెబుతున్నప్పుడు  విద్యార్థులు నన్ను ఈ విధంగా అడిగినారు

మేడమ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటున్నారు కదా అది మా క్లాస్ రూమ్ కి అనునయించి చెప్తారా అని అడిగారు అప్పుడు నేను చెప్పాను టీచర్ క్లాసు లోకి రాకముందు మీరు బాగా అల్లరి చేస్తుంటారు దూకుతారు కొట్టుకుంటూ ఉంటారు ఏమో చేస్తుంటారు మీ క్లాస్ కొచ్చిన  గురువుగారు వెంటనే మిమ్మల్ని సరిగా కూర్చోమని చెప్పి ప్రశాంత వాతావరణం సృష్టిస్తాడు ప్రశాంత వాతావరణం సృష్టించాడు కాబట్టి గురు బ్రహ్మ  కాసేపు ఆగి  తరువాత పాఠము మొదలుపెట్టి చెబుతారు క్లాసులో గురుదేవులు రాజు ఆయన క్లాస్ లో ఉన్నంతసేపు విద్యార్థుల పాటము వింటున్నారా లేదా చూచి వారిని సరి అయిన న దారిలో పెట్టే ది గురువుగారేఆ పరిపాలన గురువు గారిదే అందుకని గురువిష్ణు ఆ తర్వాత గురువు  విద్యార్థులు అభివృద్ధి లోకి రావాలని వారికి శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాడు ఆయన మహేశ్వరుడు శివుడు అనగా మంగళ కరుడుశుభం కోరుకుంటాడు అందుకని గురువు మహేశ్వరుడు గురువు తన పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు పడే సంతోషం కన్నా తను చదువు చెప్పిన విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు చాలా సంతోష పడతాడు అని ఈ విధంగా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది విద్యార్థులు చాలా సంతోషపడినారు మాకు ఇప్పటిదాకా తెలియదు మేడమ్ ఇప్పుడు తెలుసుకున్నాము అని అన్నారు


జయలక్ష్మి  పిరాట్ల

హైదరాబాద్

కామెంట్‌లు లేవు: