20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *శకటం పంచ హస్తేషు* 

            *దశహస్తేషు వాజినం* |

            *గజం హస్తసహస్రేషు* 

            *దుష్టం దూరేణ వర్జయేత్* ||


తా𝕝𝕝 *బండికి అయిదు మూరల దూరములోను, గుర్రానికి పదిమూరల దూరములోను, ఏనుగుకు వేయి మూరల దూరములోను, ఉండవచ్చును......*

*కానీ? దుష్టునకు కొన్ని యోజనముల దూరములో ఉండుట శ్రేయష్కరము...*


  👉 *తెలుగు పద్యము :* 👇

కం॥

*బండిని బారెడు దవ్వుల !* 

*నిండుగ గుఱ్ఱంబు నేడు !* 

*నికరపు బారల్ మెండుగ హస్తిని విడువుము !* 

*కొండొక దుష్టునకు లేదు కొలమానమున్ !* 


*భావము :* 


*బండిని బారెడు దూరమున వదలవలె ! గుఱ్ఱమును ఏడు బారల దూరమున వదలవలె ! ఏనుగును ఎక్కువ బారల దూరమున వదలవలె ! దుష్టుని ఎంత దూరమున వదలవలెనను కొలత కొలమానము నందేలేదు! అని భావము దుష్టుడు ఎంత ప్రమాద కారియో గదా !* 


✍️🌹💐🌸🙏

కామెంట్‌లు లేవు: