20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మహనీయుల మాట

 

🌺 *మహనీయుల మాట* 🌺


పాలలోపడ్డ బొగ్గుముక్క తాను కరిగి అయినా పాలరంగును మార్చాలని చూస్తుంది. గానీ తనరంగును మాత్రం మార్చుకోదు.

అలాగే కొందరు వ్యక్తులు తాము పతనమవుతూ ఇతరులనుకూడా పతన మార్గంలోకి లాగుతారు తప్ప తాము మాత్రం మారరు.


🌷 *నేటిమంచిమాట* 🌷


ఎంత వజ్రాలగని అయినా అక్కడ అన్నీ వజ్రాలేఉండవు.

బొగ్గు, రాయి అన్నీ కలిసే ఉంటాయి.

మంచిగాని, చెడుగానీ ఒంటరిగా దొరకవు.

మంచిచెడ్డల మిశ్రమమే ప్రపంచం.

ఈ ప్రపంచమనే గనిలో మనమే కావలసిన దానిని ఏరుకోవాలి.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌸పంచాంగం🌸

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 21 - 02 - 2026,

వారం ...  స్థిరవాసరే ( శనివారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి      : *చవితి* మ2.00 వరకు,

నక్షత్రం  :  *రేవతి* రా8.15 వరకు,

యోగం :  *శుభం* సా5.09 వరకు,

కరణం  :  *భద్ర* మ2.00 వరకు,

                 తదుపరి *బవ* రా1.05 వరకు,


వర్జ్యం                  :  *ఉ8.44 - 10.16*

దుర్ముహూర్తము   :  *ఉ6.28 - 8.00*

అమృతకాలం      :  *సా5.57 - 7.29*  

రాహుకాలం         :  *ఉ9.00 - 10.30* 

యమగండం        :  *మ1.30 - 3.00*

సూర్యరాశి           :  *కుంభం* 

చంద్రరాశి             :  *మీనం*

సూర్యోదయం      :  6.29,

సూర్యాస్తమయం :  5.59,


                *_నేటి మాట_*

 *భక్తిలో - ఫలితం పొందడం ఎలా???*

మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.

ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం. 

ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు. 

అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. 

అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది... నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది. 

ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.

ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి. 

ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. 

నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..


మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు...


             *_🌸శుభమస్తు🌸_*

 🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: