14, ఫిబ్రవరి 2024, బుధవారం

*శ్రీ పంచమి

 🙏 🍁 *శ్రీ పంచమి / మదన పంచమి* 🍀 సందర్భంగా 👇


*ప్రార్థనా శ్లోకం* - 


*యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వితా*

*యావీణా వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా*

*యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవైః సదా వందితా*

*సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాఢ్యాపహా*


భావము:-

            *మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.*


              ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తూషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.

సరస్వతి అనగా = చదువుల తల్లి.

సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.

మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

కామెంట్‌లు లేవు: