28, జులై 2023, శుక్రవారం

హైడ్రో ప్లేనింగ్

 నోట్  : మిగిలిన  మెసేజ్ క్రింద షేర్  చేయబడింది. 

------------------------------------


*♦️అసలు హైడ్రో ప్లేనింగ్ అంటే ఏమిటి*


*⛺హైడ్రో ప్లెనింగ్ అంటే రోడ్డుకి రన్నింగ్ లో ఉన్న మీ కారు టైర్ కి మధ్య గ్యాప్ ఏర్పడటం. అంటే గాలి లో ఉండిపోవడం. దీనికి ప్రధాన కారణం వర్షం వల్ల రోడ్ల పైన నిలిచి ఉన్న నీరు. రోడ్డుపైన నిలిచి ఉన్న నీరు, దుమ్ము వల్ల మీ కారు టైర్లు రోడ్డుతో కాంటాక్ట్ మిస్ అయ్యి గాలిలో తేలటం. అదేమిటి అంత బరువున్న కారు ఆ కొద్దిగా నీళ్లకే గాల్లో తేలుతుందా అని డౌట్ రావచ్చు. అవును.. మీరు కారును స్పీడ్ గా నడిపే టైంలో రోడ్డుకి మీ కార్ టైర్ల కి మధ్య ఉన్న వర్షపు నీళ్ళు, దుమ్ము వల్ల స్పీడ్ లో ఉన్నప్పుడు రోడ్డుతో ఉన్న కాంటాక్ట్ మిస్ అవుతుంది. ఇది ఒక ఫిజిక్స్ ఫార్ములా. దీనివల్ల ఆ స్పీడ్ లో కారు పల్టీలు కొట్టే అవకాశం ఉంది మరి*


*🔶మీ కారు హైడ్రో ప్లేనింగ్ ఎఫెక్ట్ కి గురైతే ఏం చేయాలి.*


*🔹కారు హైడ్రోప్లేనింగ్ ఎఫెక్ట్కి గురైందని తెలిసిన వెంటనే కారుని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి సాధారణంగా సడన్ బ్రేక్ వేస్తూ ఉంటాము. అయితే ఎట్టి పరిస్థితుల్లో సడన్ బ్రేక్ వేయకూడదు. దానికి బదులుగా బ్రేక్ వేస్తూ రిలీజ్ చేస్తూ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. దానికి తోడు డ్రైవర్ పానిక్ అవ్వకుండా ఉండటం చాలా ముఖ్యం. కారు కంట్రోల్ కోల్పోయి పక్కకు వెళ్ళిపోతున్నప్పుడు బ్యాలెన్స్ కోసం కారు స్టీరింగ్ ని వేరే డైరెక్షన్ లో తిప్పుతూ కంట్రోల్ చేయాలని చూస్తాము. దానికి బదులుగా ఎటువైపు తిరుగుతుందో దాన్ని అదే డైరెక్షన్‌లో వెళ్ళనివ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మీ కార్ టైర్లు అరిగిపోయినవి కాకుండా గ్రిప్ ఉన్న టైలర్ వాడినట్లయితే ఆ గ్రిప్ డిజైన్ మధ్యనున్న గ్యాప్ వల్ల వాటర్, గాలి ప్రవహించి హైడ్రోప్లేనింగ్ ఎఫెక్ట్‌కి గురికాకుండా ఉంటాయి*


*హైడ్రో ప్లేనింగ్ కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..*

కామెంట్‌లు లేవు: