30, సెప్టెంబర్ 2021, గురువారం

త్రిగుణములు :

 

త్రిగుణములు : 

ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. అన్యోన్య సంకలితములైఅన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము లైనవి. ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన రెండు గుణములు అణగియుండును. తమోగుణము నియమితమైతే రజో గుణము సాగును. రజస్సు నియమితమైతే సత్వము సాగును. సత్వము అణిగినప్పుడు తమస్సు మొదలగును. ప్రతి వ్యవహారములోను గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును. గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును. అపక్వవాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. క్షోభకు గురియైన వాసనలే ప్రారబ్ధ  అనుభవము నిచ్చుచున్నవి. త్రిగుణ రహితునికి సంచిత వాసనలు 

నిర్బీజమగును. క్షోభ లేనందున ప్రారబ్ధముండదు. అదే జన్మరాహిత్యము. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము.

 

శుద్ధ సాత్వికములు : 

సత్వముసంతోషముఅహింసధైర్యముక్షమఆర్జవముసన్న్యాసముపరిత్యాగమువిజ్ఞానము మొదలగునవి సహజమై యుండుట శుద్ధ సత్వగుణము.

 

సత్వగుణ జనితములు : జపముదానముయజ్ఞముతపస్సు మొదలగునవి.

 

త్రిగుణ సామ్యము : శుభముశాశ్వతత్వము

 

త్రిగుణముల అవ్యక్తము : మోక్షము

 

త్రిగుణ రహితము : అచల పరిపూర్ణముపరమ పదము.

 

త్రిగుణ కర్తలు : 

అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామిసర్వబాహ్యాంభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడుమరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీతకర్త.

 

త్రిగుణ వాసములు : 

వనవాసము సాత్వికవాసము. గ్రామవాసము రాజసిక వాసము. జూదపాన గృహము తామసిక వాసము. దేవాలయములుఋష్యాశ్రమములుపుణ్య క్షేత్రములుహృదయ నివాసము - ఇవి గుణాతీత వాసములు.

 

త్రిగుణావస్థలు : 

సత్వగుణము ప్రవృద్ధమైనప్పుడు జాగ్రదవస్థ. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థ. తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు సుషుప్త్యావస్థ. మూడు గుణములు క్షీణించినప్పుడు మూడు అవస్థలకు సాక్షియైఆత్మానుభవము పొందినప్పుడు తురీయావస్థ.

 

త్రిగుణ కర్మలు : 

సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకుండాసమర్పణ భావముతో అనుష్ఠింపబడే నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. లోక సంబంధమైన ఫలమును కోరి చేసే కర్మలు రాజసిక కర్మలు. సహజీవులను బాధిస్తూహింసిస్తూదంభ మత్సరములతో కూడిన కర్మలుఇతరులపై ఆధిపత్యమును చెలాయించే కర్మలు తామసిక కర్మలు. కర్తృత్వముభోక్తృత్వము లేకుండా జరిపే కర్మ సాధనములందు ఫలత్యాగముతోనుసర్వము బ్రహ్మరూపమని చేసే కర్మలు గుణాతీత కర్మలు.

కామెంట్‌లు లేవు: