30, సెప్టెంబర్ 2021, గురువారం

నౌకాగ్రకాక న్యాయం

 ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది. దానితోనే కాకికూడా.


కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా. కాకి లేచింది. కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు. కనుక, తిరిగి అదే జెండామీద కూర్చున్నది. మరొకసారి తిరిగి చూసింది. ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. 


ఇలా మరలా చేసి, చేసి చివరకు "ఏ ఆధారం లేదు, కాబట్టి జెండా మాత్రమే ఆధారం" అని తెలుసుకొని కదలకుండా కూర్చుండి పోయింది. దీనినే "నౌకాగ్రకాక న్యాయం" అంటారు.


అలానే మనసుకు కూడా "హరినామ స్మరణ"నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనపుడు పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది. చేసితీరుతుంది కూడా. ఎటువంటి సందేహము వలదు.


🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: