కాల్చడమే దాని లక్షణం, చందనమని తుమ్మమొద్దని ఉపేక్షించదు.
---------------------------------------------------
శ్లో.
"ఉద్యోగం కలహ: కండూ: ద్యూతం మద్యం పరస్త్రీయ:
ఆహారో మైథునం నిద్రా సేవనాత్తు వివర్ధతే "
అధికారం, కలహం, కీర్తి, జూదం, మద్యం, పరస్త్రీ వ్యామోహం తిండి, శృంగారం, నిద్ర వీటన్నింటిని అనుభవించే కొద్ది ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది, తృప్తనేదే వుండదు. అయితే యోగ్యుడనేవాడు వీటన్నింటిపట్ల మితం కలిగివుంటాడు. అవసరమైతే అదుపులో వుంచుకోగలడు.
------- హితోపదేశం (ఒకటో అధ్యాయం,40వ శ్లోకం)
శ్లో
"తుల్యం పరోపతాపిత్వం క్రుద్దయో సాధునీచయో:
న దాహే జ్వలతోర్భేద: చందనేంధన యో క్వచిత్ "
కోపమనేది మంచివాడికి కలిగినా దుర్మార్గుడికి వచ్చినా దహించడమే దాని లక్షణం. ఎలాగంటే అగ్నికి దహించడమే లక్షణం కదా, అది చందనపు కర్రలనైనా తుమ్మమొద్దులనైనా ఒకేరకంగా కాల్చి బూడిద చేస్తుంది.కనుక సజ్జనులు, దుర్జనులు కోపాన్ని అదుపులోనే వుంచుకోవాలి.
-------- ఆర్యధర్మం.
॥ శ్లోకార్థాల వివరణ॥
--------------------------------------------------------------------జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి