#అఘోరీ_నాలుగవ_చివరి_భాగము_4
ఇంతవరకూ చదివినది
[ దహనమా? ఏ దహనము? అని ఆశ్చర్యముతో అడిగాను.
వారు నవ్వి అన్నారు... ’ అదే నీ గొప్పతనము. నీకిచ్చిన కార్యాన్నీ మొక్కవోని ఏకాగ్రతతో ముగించావు, పక్కన ఏమి జరుగుతున్నదో కూడా తెలీఅంత ఏకాగ్రత!. ఈ తెల్లవారుజామున, మీరు జపములో ఉండగానే, మహా అఘోరాచార్యాణి తనువు చాలించింది. నీ ఎదురుగానే!. కానీ నువ్వు ఎరుగవు. ఈ ఉదయమే ఆమె శవ దహనం ఉంటుంది"
నాకు కళ్ళు తిరుగుతున్నట్టైంది.. మహాచార్యాణి చనిపోయిందా? నా ఎదురుగనే? నాకు తెలీకుండానే? విద్యుఘాతము తగిలినట్టైంది. అయోమయంగా చూస్తున్నాను. ]
రెండు రోజులు గడిచాయి ఇంకా మహా కుంభమేళా జరుగుతోంది. మహాచార్యాణి చనిపోయిన రోజు వచ్చి ఆశీర్వదించిన వృద్ధ అఘోరా మళ్ళీ వచ్చారు. పక్కనే ఇంకో ఇద్దరు.
" వైశ్వానరీ, నీవల్ల భారత దేశానికి, హిందూ సమాజానికి ఎంతో ఉపకారమైనది. మొన్న నువ్వుగనక జపం మధ్యలో ఆపి ఉంటే, అంతా వ్యర్థమయ్యేది. బూడిద మిగిలేది. మళ్ళీ ఇంకో నూట నలభై నాలుగు యేళ్ళ తర్వాత వచ్చే మహా కుంభ మేళా కోసము ఎదురుచూడవలసి వచ్చేది. అప్పటికి భారత దేశము సర్వ నాశనము అయి ఉండేది. అప్పుడు ఒకవేళ దేశం నిలబడినా, అప్పటికి మళ్ళీ ఒకే కుటుంబము వారు ఇద్దరు అఘోరాలు లేక అఘోరీలుగా మారేవారని ఎలా చెప్పగలము? ఇదిగో, ఈ లోలాకు తీసుకో. ఇది మహా ఆచార్యాణి నీకు ఇవ్వాలని ముందే చెప్పింది. ఆమె కుడి చెవికి మాత్రము ఇది ఒకటే ఉండేది. దీన్ని నువ్వు పెట్టుకో..."
నాకేమీ అర్థము కాలేదు. లోలాకు ఆమెకు నాలాగే ఒకటే ఉండిందా? అదే అడిగింది.. " మాహాచార్యా, ఆచార్యాణి ఒకటే లోలాకు పెట్టుకొనేదా?
అవును, ఆమె దగ్గర అది ఒకటే ఉండేది. రెండోది తెచ్చుకోలేదు అని చెప్పేది. బహుశః ఇంటి గుర్తుగా తెచ్చుకుందేమో... ఆరాత్రి గుర్తుందా? ఆచీకట్లో మొదట నిన్ను వెళ్ళిపొమ్మంది. నువ్వు ఎవరో గుర్తుపట్టక! తర్వాత మెరుపు వెలుగులో నీ చెవికిఉన్న లోలాకు చూసి నిన్ను గుర్తుపట్టి, దగ్గరకు రమ్మని పిలిచింది... వైజయంతి మహాచార్యాణి నీ జేజెమ్మ కుముద్వతి కి జేజెమ్మ అవుతుంది. తెలుసా? ఆమె వద్ద, నీవద్ద ఉన్న లోలాకులు రెండూ ఒక జత.
తాను నిర్ఘాంత పోయింది... అంటే, కుముద్వతి జేజెమ్మ ఈ మహాచార్యాణికి తెలుసు, తెలుసేమిటి, మనవరాలు కదా... తాను కూడా మునిముని మనవరాలు అవుతుంది. మరి, ఆమాట నాకు ఎందుకు చెప్పలేదు? ఆచార్యులను అడిగింది
" ఆచార్యా, మేమిద్దరం ఒకే కుటుంబము వారము అని మహా ఆచార్యాణి నాకు ఎందుకు చెప్పలేదు? ఇందాక తమరు, ఒకే కుటుంబములో ఇద్దరు అఘోరాలు గా మారేవారా? అన్నారు.. నాకది అర్థము కాలేదు.. దయచేసి చెప్పగలరా?"
అంతలో శంఖనాదాలు, బూరలు, డమరుకాలు, డప్పులు మోగిస్తూ ఒక యాభై మంది దాకా అఘోరాలు వచ్చారు. ’ హర్ హర్ మహా దేవ్" నినాదాలు మిన్నంటుతున్నాయి. అందరూ నృత్యం చేస్తున్నారు. అది చూసి ఆచార్యులు కూడా చేతులు గాలిలోకి విసరుతూ, ’ హరహర మహాదేవ్’ అని అరుస్తూ వారితోపాటు నృత్యం మొదలుపెట్టారు. తాను చేష్టలుడిగి చూస్తోంది.
అందరూ అందరికీ మిఠాయిలు పంచారు. " మొత్తం నూట ఇరవై మందీ సమసి పోయారా? " అడిగారు ఆచార్యులు ఆ వచ్చిన వారిని.
" అవును ఆచార్యా.. మొత్తం అందరూ పోయారు. చివరివాడు పోయేదాకా ఉండి, చూసి మరీ వచ్చాము. "
హరహర మహాదేవ..అంటూ ఆచార్యులు కళ్ళుమూసుకొని చేతులు పైకెత్తి ఆకాశంలోకి చేస్తున్నట్టు నమస్కరించారు.
’ వైశ్వానరీ, ఇలా రా. నువ్వు చేసిన ఆ మహత్కార్యము ఎంతగొప్పదో నీకు తెలీదు. వివరిస్తాను, రా " అన్నారు ఆచార్యులు.
ఆచార్యులు కూచోగానే అందరూ కూచున్నారు. తానూ కూర్చుంది
" మొదట, ఇప్పుడు జరిగిందేమిటో వివరించి చెప్పు.. " అని ఆచార్యులు తమ పక్కనున్న ఒక అఘోరాను అడిగారు
" ఆచార్యా, మీ ఆదేశానుసారమే ప్రయాగకు వంద కిలో మీటర్ల దూరములో వేచి ఉన్నాము. ఆకాశంలో తెల్లటి పొగ ఇక్కడనుండీ అక్కడకు వచ్చింది. కాసేపట్లోనే ఒక అరవై మంది సాధారణ పౌరులు, ఇంకో అరవై మంది కాషాయధారులు అక్కడికి వచ్చారు. ఆ పొగ ,వారందరినీ చుట్టుముట్టింది. వెంటనే వారు ఒకరినొకరు కొట్టుకోవడము మొదలుపెట్టారు. ఆ పోట్లాట యుద్ధములా మారింది...."
అతణ్ణి ఆగమని చెపుతూ ఆచార్యులు వైశ్వానరితో అన్నారు " చూశావా? మీరు మహా మాఘి రాత్రి చేసిన హోమపు ధూమము ప్రయాణించి వందకిలోమీటర్లు దాటి వెళ్ళింది, దానికి ఆకర్షితులై ఆ నూట ఇరవై మంది దుండగులూ అక్కడికి వచ్చారు.."
దుండగులా? ఎవరు వారు? అందామె.
పోయినవారము తొక్కిసలాట జరిగింది కదా? ఆ తొక్కిసలాటకు కారణమైన వారే ఈ నూటా ఇరవై మంది. చచ్చారు, పీడ వదిలింది..
వారు అక్కడికి ఎందుకు వచ్చారు? పొగ, వారిని ఆకర్షించడమేమిటి? అందామె ఆశ్చర్యపోతూ.
ఆరోజు రాత్రి మీరు చేసిన హోమము వద్ద నూట ఇరవై ఇసుక కుప్పలు పెట్టించిందిగా, వైజయంతి మహా ఆచార్యాణి? ఆ ఇసుకలో వీరి పాదరేణువులు ఉన్నాయి. ఆ ఇసుక నుండీ బయలువెడలిన పొగ కు వీరు ఆకర్షితులయ్యేలా ఆ ప్రేతాత్మలు చేశాయి.
ఏ ప్రేతాత్మలు?
చనిపోయిన భక్తులు, ఆ ముప్పై మంది ప్రేతాత్మలు. వాటికి సంవత్సరం అయ్యేవరకూ ప్రేత రూపము తప్పదు. అటుతర్వాతే, అన్ని కర్మలూ అయ్యాక మోక్షము. ప్రేత రూపం లో ఉన్నందున, తాము పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకోలేక, తమ చావుకు కారణమైన ఆ నూట ఇరవైమంది మీద కోపముతో, ఆకర్షింపబడి అక్కడికి వచ్చేలా, వారిని గుర్తించి, ఆవహించి, వారిలోవారు కొట్టుకొని చచ్చిపోయేలా చేశాయి ఆ ప్రేతాత్మలు.
మరి, అందులో కొందరు కాషాయధారులు అన్నారు? వారూ దుండగులేనా?
వారందరూ దుండగులే. కాషాయం ముసుగులో తిరిగేవారు వారు.
కానీ ఆచార్యా, ఇంత అవసరము ఎందుకుంది? జరిగిన తొక్కిసలాటకు కారణమేమో విచారణ జరుగుతోంది కదా, ప్రభుత్వము తగిన చర్య తీసుకునేది కదా? దానికోసము మనము ఇదంతా చేయడము అవసరమా, నాది అజ్ఞానమైతే మన్నించండి.
అడగవలసిన ప్రశ్ననే అడిగావు. ప్రభుత్వం వారిని ఎప్పుడో గుర్తించింది. కుంభమేళా ముగిసేదాకా వారిని ఏమీ చేయదు. ఆ తరువాత వారిని విచారించి జైల్లో పెట్టించడమో, ఎన్‌కౌంటర్ చేయడమో జరుగుతుంది. సనాతన ధర్మాన్ని ఇంత తీవ్రంగా అవమానించి, అపశ్రుతి కలిగించి, కోట్లమంది మనోభావాలను దెబ్బతీసి, ధర్మగ్లాని కలిగించాలని చూసిన వారిని
ఒక అఘోరీగా నువ్వైనా క్షమిస్తావా? లేదు కదా? ప్రభుత్వ చర్యలు రెండూ కూడా సరి కాదు. వారు జైల్లో ఉంటే మనకు అది సమ్మతము కాదు, అసలు ఈ లోకం లోనే ఉండకూడదు... వారిని ప్రభుత్వము రహస్యంగా ఎన్‌కౌంటర్ చేయడము కూడా మాకు సమ్మతము కాదు. ఎందుకంటే దానివల్ల యోగీ ఆదిత్యనాథ్ జీ కీర్తి పెరగదు సరి కదా, ఒక కళంకముగా ప్రతిపక్షాలు ప్రచారము చేస్తాయి. అలాగని మనము వారిని చంపలేము, మన నియమాలకు అది విరుద్ధము. అఘోరాలము అంటే పరమ శాంతులము. హింసకు మనలో చోటులేదు. కానీ హింసలేకుండా వారిని చంపలేము. కాబట్టి, మన చేతికి గానీ, ప్రభుత్వ చేతికి గానీ మట్టి అంటకుండా వారిలోవారే పోట్లాడుకుని చంపుకునేలా చేశాము.
ఇది ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా, ఆచార్యా? ఈ వార్త బయటికి పొక్కిపోయి అప్పుడే వచ్చిన మీడియా వారు ఆచార్యులను చుట్టుముట్టి అడుగుతున్నారు.. " ఇది మీకు ముందే తెలుసా?"
ఆచార్యులు మందహాసము చేసి, " ఇలా చేయొచ్చని తెలుసు. ఇప్పుడు లోకం దృష్టిలో , వారి చావుకు వారే కారణము. మేము చేసిన హోమాలు అంటే హేతువాదులు, సనాతన వ్యతిరేకులు నమ్ముతారా? ఎన్నటికీ నమ్మరు. ఆ అపనమ్మకాన్నే మేము ఆయుధంగా మార్చుకున్నాము. మా అఘోరాల పద్దతులే అంత "
" మీరు చెప్పింది నమ్ముతారే అనుకుందాము ఆచార్యా, కానీ ఇలా చేయచ్చు అని తెలిస్తే రేపు ప్రతిఒక్కరూ తమ శత్రువులను చట్టానికి దొరక్కుండా సులభంగా చంపే ఈ మార్గాన్ని ఎంచుకుంటే, దానికి బాధ్యులు మీరే అవుతారు కదా? అది అఘోరాల నియమావళి కిందకు వస్తుందా?"
ఇలాంటివి జరగడము ఇదే ఆఖరుసారి. ఇకపై జరిగే సంభవత లేదనే చెప్పచ్చు.
ఏ ఆధారముతో అనగలరు, ఇవి పునరావృతము కావు అని?
మొదటిది, ఎవరైనా ధర్మానికి విపరీతమైన గ్లాని కలిగించినపుడే మేము ఇలాంటి పద్దతులు ఎంచుకుంటాము. ఇటువంటి గ్లాని ఇకపై జరగబోదు. ఎందుకంటే భారత దేశము హిందూరాష్ట్రముగా అవతరించింది. ఇది ఇంకా సంధికాలమే కాబట్టి ఇదైనా జరిగింది. ఇకపై ఈ దేశములో దేశద్రోహులు ఉండే ప్రసక్తే లేదు. అందరూ సనాతన సార్వభౌమత్వానికి లోబడి ఉండవలసినదే, చట్టాలు మారబోతున్నాయి. రాజ్యాంగమే మారబోతోంది.
రెండోది, మరలా ఇలాంటి పద్దతి ప్రయోగించాలంటే ఇటువంటి ప్రత్యేక హోమాన్ని చేసేవారు కనీసం ఇద్దరు, ఒకే కుటుంబానికి చెందినవారు అయి ఉండాలి. వారి జాతకాలు ఒక్కలాగే ఉండాలి, అంటే, ఏడు గ్రహాలు ఒకే రాశిలో చేరి, పన్నెండో రాశిలో కేతువు ఉండి, కనీసం నాలుగు గ్రహాలు ఉఛ్ఛ స్థితిలో ఉండాలి. ఇది దాదాపు దుర్లభము, అసాధ్యము. ఇప్పుడు హోమము చేసిన ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అఘోరీలు. వీరిద్దరి జాతకాలూ నేను చెప్పినట్టు అచ్చంగా ఒకేలా ఉన్నాయి. ఇవి రెండూ కుదరడము ఇకపై అసాధ్యము. జాతకాలు ఒకేలా ఉన్నా, ఇద్దరూ ఒకే కుటుంబము వారైనా కూడా, ఇద్దరూ అఘోరీ/లేక అఘోరా దీక్ష తీసుకొని ఉండాలి. ఇలాంటిది ఇకపై జరగదు అనే చెప్పవచ్చు.
ఈ వార్త ప్రత్యక్షంగా చుస్తున్న జనాలు విస్తుపోతున్నారు. సనాతనులు జయజయ ధ్వానాలు చేస్తుంటే, పరులు నమ్మలేక, జరిగినదాన్ని కాదనలేక, మింగలేక కక్కలేక ఉన్నారు
మళ్ళీ మీడియావారు అడిగారు.." ఇలాగ ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? "
ఆచార్యులు సాలోచనగా అన్నారు" నిజానికి గతంలో కూడా ఇది జరిగే సాధ్యత, సంభవత అతి తక్కువగా ఉండింది. సనాతన ధర్మము ఎంత ప్రాచీనమైనదో, అఘోరా తెగ కూడా అంత ప్రాచీనమైనది. శివుడే మొట్టమొదటి అఘోరా. మొగలులు, ఆంగ్లేయులు భారత్ మీద దండెత్తి రానంత వరకూ ఈ స్థాయిలో మహా కుంభమేళాలో అపశ్రుతులు కానీ, ధర్మ గ్లాని కానీ జరిగే ప్రసక్తే లేకుండింది. ఎందుకంటే అప్పుడు భారత ఖండమంతా సనాతనమే. పర ధర్మాలు ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పుడు ధర్మగ్లాని మొదలైంది. నేను చెబుతున్నది తొక్కిసలాటలు జరగలేదని కాదు. తొక్కిసలాటలు అనుకోకుండా జరిగి ఉండవచ్చు. కానీ ఈసారిలాగా పర ధర్మీయులు ఎన్నడూ ఘాతుకము చేయలేదు. కానీ ఇటువంటి హోమము ఒకసారి జరిగింది. చేయవలసి వచ్చింది అంటే ఎక్కువ సరైనమాట. అప్పుడు కూడా వైజయంతి మహా అఘోరాచార్యాణి హోమము చేశారు. అయితే అప్పుడు ఆమెతోపాటు హోమములో కూర్చున్నది, అప్పటి అఘోరీ యోగీశ్వరి కుముద్వతి మాత. ఆమె కూడా వీరి కుటుంబానికి చెందినదే. ఆమె జాతకము కూడా వీరిద్దరి జాతకాలకు ఏమాత్రము తేడా లేకుండా ఉండింది. "
" అది యే సందర్భములో జరిగింది?"
అది, మొగలు సామ్రాజ్య పతనము తర్వాత, ఆంగ్లేయ సామ్రాజ్యము స్థాపనప్రారంభములో.. అంటే సంధికాలము లోజరిగింది. ఇప్పుడు కూడా సనాతన ధర్మము పునర్వైభవాన్ని విస్తరించబోయే కాలము. భారత్ లో పర ధర్మాలు నశించే సంధి కాలము. "
అప్పుడు జరిగిన గ్లాని ఏమిటి? ఎవరు చేశారు?"
అప్పటికి వివేకానంద స్వామి సనాతన ధర్మము వైపుకు ప్రజలను జాగృతము చేసే బృహత్కార్యములో ఉన్నారు ఇస్లామిస్టులు, క్రైస్తవ మిషనరీలకు వారంటే విరోధము. పంతొమ్మిదవ శతాబ్దము చివరలో వారిపై హత్యా ప్రయత్నము జరిగింది, నీకు తెలుసా? ఆ కాలములో స్వామి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారము సహించలేక ఆంగ్లేయులు కూడా వారిని రకరకాలుగా హింసించాలని చూశారు. చివరికి చంపాలని కూడా ప్రయత్నించారు. వారు దశమహా విద్యలు తెలిసిన రామకృష్ణుల శిష్యులు. ఎన్నెన్నో గుప్తవిద్యలు తెలిసినవారు కూడా. వారిని ఎవరూ ఏమీ చేయలేరు.. కానీ, ఆ విద్యలను వారు తమ స్వార్థము కోసము ఎప్పుడూ ఉపయోగించలేదు. ఉగ్రవాదుల నుండీ తప్పించుకోవాలంటే వారికి అదొక లెక్క కాదు, కానీ తమ విద్యలను తమను కాపాడుకోవడము కోసము ఉపయోగించుట వారికి ఆమోదయోగ్యము కాదు. కాబట్టి వారిని చంపడము ఆంగ్లేయులకు సులభము అయ్యేది. కానీ అప్పుడు ఆర్ ఎస్ ఎస్ వారి ప్రోద్బలముతో, మాలో కొందరు ముందుకు వచ్చి, ఆ దుండగులు తమలోతాము కొట్టుకొని చచ్చేలా ఈ హోమము చేశాము. అప్పుడు నేను కూడా యోగీశ్వర్ గా ఉన్నాను. అయితే అప్పటి ఆ సంఘటనలో చనిపోయినవారు పది మంది కూడా లేరు. ఈ స్థాయిలో జరగలేదు. హోమము చేసి తమవారిని మేము చంపాము అని ఒప్పుకొని ప్రకటించే స్థాయిలో లేరు బ్రిటిష్ వారు. అసలు ఈ వార్త పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు చేసిన హోమములో, ఇప్పుడు వైజయంతి ఆచార్యాణి చనిపోయినట్టే, కుముద్వతీ యోగేశ్వరి చనిపోయింది. తనకన్నా చిన్నదిఅయిన కుముద్వతి చనిపోవడము వైజయంతి మాతకు జీర్ణము కాలేదు. కానీ అది శివుడాజ్ఞ గా భావించి సమాధాన పడింది. కుముద్వతి చెవికి ఉన్న శంఖాకారములోని ఆ లోలాకును ఆమె తీసుకొని ధరించింది. ఇప్పుడు దాన్నే నీకు ఇచ్చాము. "
మరి నన్ను ప్రత్యేక ఉద్దేశముతో రప్పించాను అని చెప్పిన మహాచార్యాణి, నన్ను గుర్తించనట్టు మొదట్లో ఎందుకు మాట్లాడింది?
నువ్వు వస్తావని ఆమెకు తెలుసు కానీ, వచ్చింది నువ్వేనా కాదా.. అని పరీక్ష అన్నమాట.
నాది ఇంకో ప్రశ్న, ఆచార్యా, హోమము జరిగాక ఇప్పటిలా అప్పుడూ ఒకరు చనిపోవడము ఏమిటి? ఇలా హోమము చేస్తే ఆ చేసిన వారిలో ఒకరు చనిపోతారా?
అవును. హోమము అయ్యాక, స్నానము కూడా అయ్యాక జపము చేసేటప్పుడు ఎవరు ముందుగా జపము ముగించి కనులు తెరిస్తే వారు వెంటనే తనువు చాలిస్తారు. ఇది అప్పుడూ ఋజువైంది, ఇప్పుడూ ఋజువైంది. జపము చేయడానికి ఒక వేగము, ఒక సంఖ్య ఉంటాయి. ఆ సంఖ్య ఎంతో అంత జపము మాత్రమే చేయాలి, నిర్ణీత వేగములో మాత్రమే చేయాలి. చేశాక మనసులో దేవతకు పంచపూజలు చేసి అనుగ్రహాన్ని పొంది కనులు తెరవాలి. కనులు తెరవడములో అరక్షణం తేడా ఉన్నా కూడా మొదట తెరచినవారే విగత జీవులు అవుతారు.
వింటున్న అందరూ మాటలురానట్టు ఉండిపోయారు.
వైశ్వానరి దిగ్భ్రాంతికి లోనై, అంతలోనే తమాయించుకొని, ఇద్దరు జేజెమ్మలకు నమస్కరించి వైజయంతి దహన కార్యానికి వెళ్ళింది.
/ శుభం భూయాత్ /
// సమాప్తమ్//
By Vibhatha Mitra
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి