☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విష్ణు సహస్రనామ స్తోత్రము*
*రోజూ ఒక శ్లోకం*
*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్లోకం (60)*
*భగవాన్ భగహానందీ*
*వనమాలీ హలాయుధః ।*
*ఆదిత్యో జ్యోతిరాదిత్యః*
*సహిష్ణుర్గతిసత్తమః ॥*
*ప్రతి పదార్థం:~*
*560) భగవాన్ - పూజనీయుడు; పూజ్యులు అందరిలోనూ పూజ్యతముడు;*
*561) భగహా - ప్రళయకాలమున సకల సంపదలను హరించి తనయందే లీనము చేసుకును వాడు;*
*562) ఆనందీ - ఆనందమే స్వరూప స్వభావములుగా కలిగినవాడు*
*563) వనమాలీ - వనమాలను ధరించినవాడు.*
*564) హలాయుధ: - నాగలిని ఆయుధముగా ధరించిన వాడు.*
*565) ఆదిత్య: - అదితి, కశ్యపులకు జన్మించిన శ్రీ వామన మూర్తి*
*566) జ్యోతిరాదిత్య: - దివ్య ప్రకాశముతో విరాజిల్లుచున్న సూర్యుడు*
*567) సహిష్ణు: - అపారమైన సహనము కలవాడు; ద్వంద్వములను సహించువాడు.*
*568) గతిసత్తమ: - శరణాగతులకు ఉత్తమమైన గమ్యము;*
*తాత్పర్యము:~*
*ఉత్పత్తి ప్రళయములు, భూతములయొక్క గతాగతములు, వీనిని సంపూర్ణముగా నెరింగినవాడును, ప్రళయకాలమందు ఈ గుణములన్నీ తనలోనే ఆవహింపచేసికొనువాడును, ఆనంద స్వరూపుడును, తన్నాశ్రయించిన భక్తులకు ఆనందమును ప్రసాదించువాడును, వైజయంతి మాలను సదా ధరించి యుండువాడును, నాగలిని ఆయుధముగా ధరించిన పరశురామావతారమును, వామనావతారమును, జ్యోతి స్వరూపుడైన సూర్య భగవానుడును, ద్వంద్వములను సహించువాడును, శరణాగతులకు ఉత్తమమైన గమ్యము తానే అయినవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*
*పాఠకులందరికీ శుభం భవతు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సూచన*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*స్వాతి నక్షత్రం 4వ పాదం జాతకులు పై 60వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఓం నమో నారాయణాయ!*
*ఓం నమః శివాయ!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి