24, ఫిబ్రవరి 2025, సోమవారం

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు::


      80వ దివ్యదేశము 🕉


🙏 శ్రీ తిరునిలాత్తింగళ్ తుండత్తాన్

 పెరుమాళ్ ఆలయం, 


 ( ఏకామ్రేశ్వర ఆలయంలో ) 


కాంచీపురం 🙏


🔅 ప్రధాన దైవం: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: వేరొరు వన్ఱిల్లా తాయార్

🔅 పుష్కరిణి: చంద్రపుష్కరిణి

🔅విమానం: పురుష సూక్త విమానము

🔅ప్రత్యక్షం: రుద్రుడు


🔔 స్థలపురాణం 🔔


💠 ఒకప్పుడు సహస్రాధిక ఆలయాలతో అలరారిన కాంచీపురం లో ప్రస్తుతం కొద్ది మాత్రమే మిగిలాయి.

 వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ ఏకాంబరేశ్వర, శ్రీ కైలాసనాధ, శ్రీ కామాక్షి అమ్మన్, 

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఇలా ఉన్నది జాబితా!  


💠 నగరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండటం విశేషం. 

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


💠ఒకనాడు కైలాసంలో సరస సల్లాపాల మధ్య పార్వతీదేవి త్రినేత్రుని నేత్రాలను తన కోమల హస్తాలతో క్షణకాలం మూసిందట. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు ఆ నేత్రాలు. క్షణకాలం అయినా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట. తెలియక చేసినా తప్పు తప్పే కనుక పరిహరం చెల్లించుకోడానికి అర్దనారీశ్వరుని అనుమతితో కాంచీపురం చేరుకొన్నదట గౌరీదేవి.

 ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి భక్తి శ్రద్దలతో సేవించసాగిందట. శివుడు కొంతకాలానికి ఆమె పరీక్షింపనెంచారట.


💠తన జటాజూటాల నుండి గంగను వదిలారట. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహవేగానికి సైకతలింగం ఎక్కడ మునిగి పోతుందో అని భయపడిందట. ఆందోళనతో కామాక్షి దేవి శ్రీ మహవిష్ణువు ను శరణు కోరిందట. 

ఆయన ఆమెను లింగాన్ని ఆలింగనము చేసుకోమని చెప్పి తాను విశ్వరూపాన్ని ధరించి ప్రవాహనికి అడ్డుగా శయనించారట. ముల్లోకాలకు విస్తరించిన శ్రీహరి ని దేవతలు, మహర్షులు స్థుతించసాగారట.


💠 ఆ సమయంలో చంద్రుని కిరణాలు సోకి శ్రీ వారి కంఠం నీలంగా మారిందట. 

అందుకే స్వామిని "శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ "అని పిలుస్తారు.


💠 శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ని అమ్మవారు కౌగలించుకోవడం వలన లింగం పైన ఆమె కరకంకళాల మరియు వక్షోజాల ముద్రలు పడినాయట. వాటిని నేటికీ లింగం మీద చూడవచ్చని చెబుతారు. ఉమా దేవి తపమాచరించిన మామిడి చెట్టు కూడా ప్రాంగణంలో ఉన్నది. 


💠ప్రదక్షిణా మార్గంలో ఉన్న 

గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో దర్శనమిస్తారు పెరుమాళ్. 

దేవేరులు, ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడుడు ఏమీ ఉండవు. 

శైవార్చకులే పూజలు చేసే ఈ మందిరంలో ఆదిశేషుని పడగ ను ఛత్రం చేసుకుని చతుర్భుజాలతో స్తానక భంగిమలో రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు

 శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్. 


💠శ్రీ నీలతింగళ్ తుండతాన్ పెరుమాళ్ ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం ఆవరణలో ఉంది; 

శివుని పంచ బూత స్థలాలలో ఈ క్షేత్రం భూమికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 

ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురం లో ఉంది. 


💠 శైవ పూజారులు పూజలు చేస్తున్న ఏకైక వైష్ణవ దివ్యదేశం ఇది. ఈ స్థలాన్ని తిరునేడుతంగడం అంటారు.


💠 మూలవర్ తన అభయ హస్తంతో పురుష సూత్రం విమానం కింద పడమర ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో "నిలతిథింగ్‌తుల్తాథన్" మరియు "చంద్రసూదప్ పెరుమాళ్" గా పూజలు అందుకుంటున్నారు. థాయర్ నేర్ ఒరువర్ ఇల్లా వల్లి నాచియర్ (నీలాతింగళ్ తుండం థాయర్)


🙏 జై శ్రీమన్నారాయణ 🙏

కామెంట్‌లు లేవు: