24, ఫిబ్రవరి 2025, సోమవారం

తెలుగు మన భాష

 తెలుగు మన భాష

తెలుగు మన సంస్కృతి

తెలుగు మన గుర్తింపు

తెలుగు మన అస్తిత్వం


ఇట్టి తెలుగు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటుంది. పాఠశాలల నుండి తెలుగు మాధ్యమం తరిమివేయ బడింది. కార్పరేట్ కళాశాలల ప్రభావం వలన ఇంటర్మీడియట్ లో తెలుగుకు బదులు మార్కుల కొరకు సంస్కృతం వచ్చి చేరింది. డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి. కొన్ని కళాశాలల్లో మాత్రమే తెలుగు అంశం బోధించబడుతుంది.


ఇక యువకులు చాలా వరకు తెలుగు వార్తాపత్రిక కూడా చదవలేని పరిస్థితి, వ్రాయడం ఇంకా కష్టమైన అంశం. తెలుగు మాట్లాడ గలుగుతారు. అదీ ఎన్నో ఉచ్ఛారణ దోషాలతో. ఇక పద్యమైతే మరచిపోవాలి. ఇప్పుడు యువత పరిస్థితి ఏమిటంటే తెలుగును ఆంగ్ల అక్షరాలలో వ్రాసుకొని చదువుకుంటారు. సినిమా పాటలు లిరిక్ ఎడిషన్ ఆంగ్ల అక్షరాలతో వస్తుంది గమనించండి. ఈ పరిస్థితులలో ఒక రెండు తరాల తరువాత తెలుగు అక్షరం కనుమరుగై పోతుందని భయంగా వుంది. 


ఈ పరిస్థితి ఎదుర్కొని తెలుగును ఫరిడవిల్లేలా చూసే బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది. అందరు కలిసి తెలుగు భాషకై ప్రజలను చైతన్య పరచి కృషి చేయడం ఎంతైనా అవసరం.

కామెంట్‌లు లేవు: