#శ్రావణమాసం
పౌర్ణమి శ్రవణా నక్షత్రముతో కూడుకొని వున్న మాసమే శ్రావణ మాసము. ఈ మాసము లక్ష్మి దేవికి అత్యంత ప్రీతి పాత్రము గా పూర్వ శాస్త్రముల నిర్వచనము. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన గరళాన్ని మహా శివుడు తన ఖంఠం లో బందించిన సమయము గా తెలుస్తోంది,
మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించుతారు, నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతాన్ని గురించి తెలిపినట్లు పురాణాలు వివరించుతునాయి, ఈ మాసంలో అన్ని మంగళవారల్లో శ్రావణ మంగళవార వ్రతం చేయడం ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండుటయేకాక అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంమున వరలక్ష్మీ వ్రతం గా చెపుతారు. శ్రావణమాసంలో వచ్చే అన్ని శుక్రవారములు లక్ష్మీదేవిని పూజించుట శుభము . పెరంటాల్లను పిలిచి తాంబూలం ఇచ్చుట వలన సౌభాగ్యం ధన దాన్యములతో వర్ధిల్లుతాఋ అని శివుడు పార్వతీదేవికి వివరించినట్లు తెలుస్తోంది.
పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటారు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రాఖి పండగ. రక్షాబంధనం జరుపుకుంటాం. ఇంకా
శ్రావణ పూర్ణిమ. జంధ్యాల పూర్ణిమ, రాఖి పండగ ,శ్రీకృష్ణ జన్మష్టామి, స్వాతంత్ర్య దినోత్సవం, నాలుగు శుక్రవారములు, అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగాఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి అని జ్యోతిష్య శాస్త్రరీత్యా తెలుస్తోంది.
ఇట్లు
శ్రీ భువనేశ్వరి పీఠం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి