9, ఆగస్టు 2021, సోమవారం

సుశీలో మాతృ పుణ్యేన

 శ్లో|| సుశీలో మాతృ పుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్ | ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్ |


భావము:


ఏ వ్యక్తియైనా తన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద కలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తమ వంశపూర్వికులు చేసిన పుణ్యం వలన ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వలన ధనవంతు డవుతాడు.


పిల్లలు మంచి శీలవంతులు, బుద్ధిమంతులు, ధర్మపరులు, కావాలంటే మనం పుణ్యకార్యాలు చేయాలి. మంచివాళ్లం కావాలి. కనుక మనమందరమూ మంచి మార్గంలో నడుద్దాం

కామెంట్‌లు లేవు: