21, మే 2024, మంగళవారం

వినిపించని రాగం...

 *వినిపించని రాగం...

రచన: గౌరి !


*(*సిరి కోన మహిళా సాహిత్యోత్సవం  లో చదివిన కథ*)

     కంప్యూటర్ లో ఆఖరి ఈ మెయిల్ కూడా చూసుకుని అవసరమైన వాటికి రిప్లై చేసి కుర్చీలో వెనక్కి వాలి బద్ధక

 గా వేళ్ళు విరుచుకుంది అరుణ.

          అరుణ ప్రభుత్వ ఉద్యోగంచేసి మొన్ననే రిటైర్ అయింది. ఊరికే ఉండటానికి   మనస్కరించక ఒంటరితనం పోగొట్టుకోవటానికి ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద హోదా లోనే ఉంది. ఆమెకి ఉన్నదల్లా ఒక్క చెల్లెలే.

    " అమ్మగారూ... ఏసీ ఏ సేను ఇంక పడుకోండి. నేను పోతున్నాను" అంటూ తలుపు తాళం వేసి వెళ్ళిపోయింది ))పనమ్మాయి.

       చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ఫ్రెష్ గా ఉండటానికి దూ మెరుగ్గా పౌడర్ ఒత్తుకుని బెడ్రూం లోకి అడుగుపెట్టింది..  చల్లని వాతావరణం.. మంద్రం గ  ఏసీ శబ్దం.. సాయిబాబా ఫోటో కి వేసిన మల్లె పూల గుబాళింపు....  గదిలోకి అడుగు పెట్టగానే అద్భుతంగా హాయిగా అనిపించింది,

      పక్క మీద పడుకుని పాటలు విందాము అనుకునే లోపల మొబైల్ మోగింది. అబ్బా., అనుకుంటూ చూసింది

       "రావు గారు "

 రావు గారు అరుణ చేరిన   కొత్త ఆఫీస్ లో కొలీగ్.అందరికీ తలలో  నాలుకలా మెలగుతూ ఎవర్నీ నొప్పించకుండా చమత్కారంగా మాట్లాడుతారు. ఐదు వాక్యాలు మాట్లాడితే అందులో నాలుగు పంచ్ లు  ఉంటాయి. ఉత్సాహంగా ఫోన్ రిసీవ్ చేసుకుంది .

     "హలో అరుణ గారు ఏంటి డిస్టబ్ చేశానా "అవతల్నుంచి రావు గారి గొంతు  ఉత్సాహంగా...

    లేదు లేదు చెప్పండి అంది స్నేహ పూర్వకంగా

   

     "ఏం లేదండీ ఈరోజు మిత్రుడు బలవంతం మీద ఒక  సంగీత విభావరి కి వెళ్లాను అక్కడ సంగీతం మీద మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి.

    వెంటనే మీరు జ్ఞాపకం వచ్చారు. మీ కోసం పుస్తకాలు కొన్నాను. రేపు తెచ్చి ఇస్తాను. ఎప్పుడు తీరికగా వుంటారు." గొంతులో ఎంతో ఆప్యాయత.

     " అవునా.. చాలా చాలా సంతోషం అండి. నాకు సంగీతం ఇష్టం అని మీకెలా తెలుసు."

    "ఎలా తెలిసిందో మీరే చెప్పుకోండి" అన్నాడు సరదాగా.

      చిన్న చిలిపితనంతో కూడిన ఆ ఆ ప్రశ్నకి ముచ్చటేసింది.

      ఒక నాలుగైదు జవాబులు చెప్పి కాదు అనిపించుకున్నాక 


"మీరే చెప్పారండి మొన్న మన ఆఫీస్  న్యూ ఇయర్ గెట్ టుగెదర్ లో" అన్నాడు.


" ఓహో... మతిమతిమరుపు వచ్చేసిందండోయ్".. సరదాగా నవ్వుతూ అనేసినా,  న్యూ ఇయర్ ఫంక్షన్  సందడిలో హడావిడిలో చెప్పినా తన ఇష్టాలను జ్ఞాపకం  పెట్టుకున్నందుకు మురిసి  పోయింది..

    

     ఈ మధ్య "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న " అనే పాట బాగా వైరల్ అయింది చూశారా..


 అవునండి కొంచెం సంగీతపరంగా కూడా బానే ఉంది....


సంభాషణ సంగీతం మీద నుండి సినిమా సంగీతo మీదకి  మళ్ళింది.

      అలా అలా సంభాషణ అనేక విషయాల మీద సాగుతూనే ఉంది.

     రావుగారి పంచులకు నవ్వుతూ...  సంభాషణ ఎంజాయ్ చేస్తోంది అరుణ

   

0 ఇంతలో మరొక కాల్  వస్తున్నట్టు సిగ్నల్... అటువైపు  చూసింది అరుణ.

  

చిట్టి తల్లి...

 తన చిన్నారి చెల్లి.


 ఒక్క క్షణం "అబ్బా ఇంత మంచి సంభాషణ ఆపాలా" అనిపించింది.

    మరు  నిమిషం తేరుకుని రావు గారికి విషయం చెప్పి ఫోన్ కట్ చేసింది.

  

     చిట్టీతల్లి తన ప్రాణం.అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో చిట్టి తల్లిని తన దగ్గరికి తెచ్చుకుంది.

   పిల్లలు లేక పోవడంతో తన  సొంత పిల్లగా పెంచుకుంది.


    ఆరు నెలల క్రితమే పెళ్లి అయ్యి భర్త వెంట అమెరికా కి వెళ్ళిపోయింది చిట్టితల్లి 

       పట్టణంలోనే పెరిగినా  అమెరికా అంతా కొత్తగా అనిపించింది చిట్టితల్లికి.

    అక్కడ చలి వాతావరణం షాపింగ్ విధానం, ఎలక్ట్రికల్ పొయ్యి..,, బాత్ టాబ్బు  అన్నీ వింతలే...ఆ ముచ్చట్లు చెప్పటానికి 

     రోజు భర్త ఆఫీస్ కి వెళ్ళి పోగానే అరుణ కి ఫోన్ చేసేది. అరుణ కి కూడా అ టైము తీరికే  అవటంతో ఇద్దరూ చాలాసేపు హస్క్ వేసేవారు.


      ఈ మధ్య రావు గారు తరచూ ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడుతూ ఉండటం వల్ల కొన్ని కాల్స్ మిస్సయింది.


     

.   "ఎలా ఉన్నావ్ రా చిట్టితల్లి" ఆప్యాయంగా పలకరించింది

      బావున్నానక్కా..

 అయినా ఏంటమ్మా ఈమధ్య నీ ఫోను తరుచూ ఎంగేజ్డ్  వస్తుంది. గుడ్ న్యూస్ చెబ్దామని  ఫోన్ చేస్తే అరగంట నుంచి ఎంగేజ్డ్..... నా మాటలు అంత బోర్ కొడుతున్నాయా   నీకు 

    

     కినుక..

చిట్టి తల్లి  మాటల్లో

   

       లే దు లేదు  ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా! అయినా ఆ ఫోన్కాల్స్ అయ్యాక నీతో మాట్లాడితే మనం ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు.. అవునా.. గారంగా చెల్లెల్ని ఓదార్చింది.

  

     సరే లే...నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానక్కా..

మూడో నెల... కన్ఫామ్ చేశారు.

  ,

     ఓ ఎంత మంచి వార్త చెప్పావు. అయితే మరి నువ్వు   డెలివరీ కి ఎలాగో ఇక్కడికి రావాలి కదా కొంచెం ముందుగా నువ్వు మీ ఆయన వచ్చేయండి అంది ఆనందంగా.

    

     లేదక్కా నువ్వే రావాలి ఆయన మరీమరీ చెప్పమన్నారు.. అందరం కలిసి సరదాగా గడపచ్చ్చు.  నువ్వు అమెరికా చూసినట్టు ఉంటుంది

  

  అయినా అన్ని రోజులు నేను అక్కడికి వస్తే ఆయనకు తోడు ఎవరుంటారు  అక్కా


...  ఇవాల్టికి ఇంక  ఉంటాను. అలసిపోయాను. నువ్వు కూడా పడుకో!!చాలా లేట్ అయింది. Ph కట్ చేసింది

    

      ఎంత శుభ వార్త చెప్పింది చిట్టి తల్లి? తన కళ్ళెదుట పెరిగింది అప్పుడే దానికి  పాప..... పెద్ద ఆరింద లాగా మాట్లాడుతోంది.

     మొన్న మొన్నటి దాకా తను తోడు వస్తేగానీ ఎక్కడికి వెళ్లని పిల్ల ఇవాళ తనే భర్తకి తోడుగా ఉండాలి అని అనుకుంటుంది. పిచ్చి పిల్ల 


 సడన్  గా చిట్టితల్లి ఫోన్ కి తన చిరాకు పడిన విషయం జ్ఞాపకం వచ్చింది...

     చిన్న పశ్చాత్తాపం లాంటిది కలిగింది.

   ఎందుకు.. ఎందుకు తనకి చికాకు కలిగింది

      చిట్టి తల్లి తన ప్రాణం... అయినా రావు గారు కాల్ ఎందుకు కట్ చేయలేకపోయింది

మొబైల్ లో నుండి 

 ఏదో మెసేజ్ వచ్చినట్లు రింగ్ వచ్చింది. అప్రయత్నంగానే చూసింది 


      రావు గారి దగ్గర నుంచి మెసేజ్  " రేపు ఎన్ని గంటలకి రమ్మంటారు అని"


    ఎందుకో ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఉన్న ఉత్సాహం లేదు.. జవాబు ఇవ్వాలనిపించలేదు.

 

     కళ్ళు మూసుకుని నిద్ర కి ప్రయత్నించింది.


ఏదో చెప్పలేని అలజడి మనసులో


 ఎప్పటికో నిద్ర పోయింది.

 *      *     *     *

   మర్నాడు  8:30 నుంచి ఏదో ఎదురుచూపు


ఇవాళ రావు గారు వస్తానన్నారే.  రాలేదే..


 ఫోనయినా  చేయొచ్చుగా 

 

    నిన్న నేను మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వ లేదని బాధపడ్డా రా


   రావు గారు ఫోన్ చేస్తే బావుండు అని ఆశ


      ఫోన్ మోగింది ఒక్క ఉదుటున తీసుకుంది.


ఎవరో అనాధాశ్రమం వారు అతి ప్రయత్నం మీద  శాంతంగా  జవాబు చెప్పి పెట్టేసింది.

  

మనసు  మళ్లించు కోవాలని పుస్తకం తీసింది.

 

  కళ్ళు పుస్తకం మీద ఉన్నాయి గానీ చెవులు మాత్రం  గేటు చప్పుడు మీదే ఉన్నాయి.


 

    "మేడం మీరు ఏమి రిప్లై ఇవ్వలేదు. నేనే వచ్చేసాను." గేటు దగ్గర నుండి రావు గారి పలకరింపు.

 

"అయ్యో పర్వాలేదండి. రండి రండి "ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది


" కూర్చోండి కాఫీ తెస్తాను" అంటూ లోపలి వెళ్ళిపోయింది

 "కాఫీ చాలా బాగుందండి" తాగుతూ సంభాషణ ప్రారంభించారు రావు గారు.


షరా మామూలుగా

 గంటసేపు ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది.


నేను  వస్తానండి మరి అంటూ బయలుదేరారు రావు గారు.

*        *      *       *

 భోజనం చేసి నడుo వాల్చింది


 ఎదురుగా షోకేస్ లో చిట్టితల్లి పెయింట్ చేసిన చిత్రాలు టెడ్డీబేర్ లు అన్నీ ఉన్నాయి


    వాటిని చూడగానే ఎందుకో గిల్టీ గా అనిపించింది

  

  నేనెందుకు చిట్టి తల్లి తో ఇంతకు ముందoత క్లోజ్ గా   మాట్లాడ లేకపో పోతున్నాను.

 రాత్రి మెసేజ్ కూడా ఇవ్వ దలచ్చుకోని   తాను

    రావు గారు రాంగానే ఎందుకు అంత ఉత్సాహంగా మాట్లాడింది.


 ఇది అసలు పద్ధతేనా


ఏమిటి ఈ డ్యూ యల్ వైఖరి 

    చాలా చాలా అసంతృప్తిగా చికాకుగా అనిపించింది.


    కొన్ని రోజులుగా తన లో జరుగుతున్న సంఘర్షణ ఆ రోజు మరింత ఎక్కువ అయినట్టు అనిపించింది


సన్నగా ప్రారంభమైన తలనొప్పి మరింత ఎక్కువైంది


మెల్లగా గుండె దడ....

 *    *     *     *

 అరుణ చెప్పినదంతా శ్రద్ధగా విన్న సైకియాట్రిస్ట్ దీర్ఘంగా నిట్టూర్చి ప్రారంభించారు 


ఇది నీ ఒక్కర్తి సమస్య కాదమ్మా...


   ఇప్పుడు అరవై దాటి ఒంటరిగా ఉంటున్న.  చాలామంది ఆడవాళ్ల సమస్య.


     చూడమ్మా అరుణ... మనిషికి  తనను గురించి తనకు తెలిసేదిపావు

 వంతు మాత్రమే. వీటిలో వుండే ఐస్బెర్గ్ లాగా అన్నమాట.. 


    మనకు తెలుసు అనుకున్నవన్నీ చాలా కొద్ది మాత్రమే.


     లోపలి పొరల్లో దాగి ఉన్న విషయాలు మనకి అంతగా తెలియదు. 

    మనిషిలో రెండు విభిన్న పరిస్థితులు ఉంటాయి


     ఒకటి తనలో తాను ఉండేది.

 బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్

[05/04, 21:45] Gowri: రెండోది తనకోసం తాను ఉండేది బీ ఇంగ్  ఫర్ ఇట్ సెల్ఫ్ .

    మొదటిది అచేతన స్థితి

 రెండోది చైతన్యవంతమైనది

 మనిషి తనలో తాను ఉండలేడు.

     తన నుంచి తాను విడిపించుకుని చైతన్యంతో ముందుకు పోదాం అనుకుంటాడు.

      అది సాధారణమైన స్వభావం కాదు కాబట్టి సంఘర్షణ తప్పదు.

     

     చిన్నప్పటి నుంచి నువ్వు నీకోసం బతకలేదు.


 నీ  కా ఆలోచన వచ్చే అవకాశమే లేదు


మీ అమ్మ పోయిన తర్వాత ఆ లోటు లేకుండా చిట్టి తల్లిని పెంచటంలోమునిగిపోయావు.


చిట్టి తల్లికి పెళ్లయ్యాక తనదంటూ ఒక లోకం ఏర్పడింది. ఆమె నీ పరిధిలో నుంచి మరొకరి పరిధిలోకి వెళ్ళిపోయింది.


    ఆమె కొత్తదైన జీవితం గురించి నీతో చెప్పటంతో నీ అచేతనలో....

      మనసు లోపలి పొరలలో  సంఘర్షణ ప్రారంభమైంది.


     నీకు తెలియకుండానే ఒంటరితనం నిన్ను ఆవహించింది...


అందులోనూ నువ్వు  ఇప్పుడు పని చేస్తున్న రంగం అలాంటివాటికి అనుగుణమైనది.


    ఒకరితో ఒకరు కలివిడిగా ..

సరదాగా    ఉంటూ పనులు సాధించే రంగం. ఇది నీకు కొత్త. కానీ కావాలి బాగుంది  అనిపిస్తోంది.


      చూడమ్మా ఒక్క విషయం అర్థం చేసుకో... మనిషికి చిన్నప్పుడు ఎలాగ ఒక తోడు అవసరమో ఒక వయసు వచ్చాక పెద్దవారు అయిపోయాక తోడు అవసరం. అందుకే పెద్దవాళ్ళు *తోడు-నీడ *అన్నారు.


  ఎంత బాగా గడిపేస్తున్నా ము అనుకున్నా తోడు లేదనే భావన మనిషిని ఆవరిస్తూ నే ఉంటుంది.


ఆ తోడు లభించినప్పుడు 

  

ఆ లభించిన తోడు   విజాతి అయినప్పుడు ఎంతలేదన్నా కొంత ఆకర్షణ మనసులో నిలుస్తుంది.


    స్నేహ భావం లో ఎటువంటి కల్మషం లేక పోయి నా అది స్త్రీ పురుషుల మధ్య ఉన్నప్పుడు సమాజం ఏమంటుందో అనే సంకోచం ఉంటుంది.


*ఇది ఒక విచిత్రమైన స్థితి*

 వివేకంతో ఆలోచించు


       నీ మనసుని నువ్వు తరచి       చూసుకో...

 ఇప్పటికైనా నీ కోసం నువ్వు బతుకు.

 మీ అమ్మానాన్నల పెంపకం,

      నువ్వు చిన్నప్పుడు గడిపిన ఒద్దికైన బాల్యం, భారతీయ ధర్మం మీద నీ నమ్మకం   నీ మనసుకు వ్యతిరేకంగా నిన్ను కచ్చితంగా నడవనివ్వదు. 


      మ్యాన్ ఈజ్ నథింగ్ బట్  విచ్ హి మేక్స్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ .. అన్నారు ప్రముఖ నవలాకారుడు sarth


 అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు.


   మనకు తెలియనిది ఏది మన ను బాధించదు. అంటాడు  సైకాలజీ కి ఆద్యుడు ఫ్రాయిడ్.


 వర్తమానంలో జీవించు

 నీ పరిధిలో నువ్వు చక్కగా ఉండు.


    ప్రముఖ సైకాలజిస్ట్ సాహిత్య    మాటలు వివేకం కలిగిన అరుణకి బాగానే అర్థం అయ్యాయి.

 తేలిక పడ్డ మనసుతో బయటపడింది.... ఇంటి ముఖం పట్టింది  .


సిరికోన సౌజన్యంతో-

కామెంట్‌లు లేవు: