21, మే 2024, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*377వ నామ మంత్రము* 

*ఓం జయాయై నమః*

వరాహపర్వతంపై జయ అను దేవతాస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జయా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం జయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి తలచిన కార్యములు శుభప్రదముగాను, జయప్రదముగాను నెరవేరునట్లు అనుగ్రహించును.

శ్రీమాత వరాహగిరియందు నెలకొనియున్న జయ యను దేవతాస్వరూపిణి యని పద్మపురాణమందు వివరించబడినది.

పరమేశ్వరి సర్వత్ర జయముగలిగినది. అలాగేభక్తులను కూడా సర్వత్ర జయము కలిగినవారిగా అనుగ్రహము చూపును. మహిషాసుర, భండాసురాది రాక్షస సంహారమునందు జయము తప్ప అపజయము లేనిది. తనను సేవించు భక్తులకు తలచిన కార్యములను జయప్రద మొనరించునది గనుక పరమేశ్వరి *జయా* యని అనబడినది.

పాండవులు అరణ్యవాసము ముగించుకొని అజ్ఞాతవాసమునకు వెళ్ళునప్పుడు అమ్మవారిని సేవించుకున్నారు. విరాటరాజు కొలువులో వివిధ మారు వేషములతో ప్రవేశించారు. సంవత్సరం అజ్ఞాతవాసదీక్షను భంగపరచడానికి దుర్యోధనుని అనేక కుతంత్రాలను అధిగమించినది ఆ పరమేశ్వరి కరుణచేతనే. మహాబలుడు కీచకుడు భీముని చేతిలో సంహరింపబడడం, ద్రౌపది మానరక్షణ కలగడం - అంతటికి ఆ పరమేశ్వరి చల్లని చూపులే కారణము. పాండవులు తమ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని ఆ పరమేశ్వరి కరుణచేతనే దిగ్విజయంగా ముగించుకున్నారు. పరమేశ్వరి కరుణ ఉంటే మృత్యువుకూడ భయపడి పారిపోతుంది. ప్రతీ ఊరికీ పొలిమేరలలో గ్రామదేవతగా విరాజిల్లుతూ గ్రామప్రజల వ్యవసాయ కార్యక్రమముల యందును, గృహములో వివాహాది శుభకార్యములయందును జయము కలుగజేయునది పరమేశ్వరియే. గనుకనే పరమేశ్వరి *జయా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం జయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*837వ నామ మంత్రము* 

*ఓం వియత్ప్రసవే నమః* 

ఆకాశమును పుట్టించిన లేక ప్రసవించిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వియత్ప్రసూః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం వియత్ప్రసవే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో సేవించు భక్తులకు ఆ జగన్మాత ఆయురారోగ్యములు, సిరిసంపదలు, పాడిపంటలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించి సర్వదా ఆపదలనుండి రక్షించుచూ ఉండును.

*వియతః ఆకాశస్య ప్రసూఃజనికా*

*ఆత్మన ఆకాశః సంభూతః* (సౌభాగ్యభాస్కరం, 943వ పుట)

'పరమాత్మనుండి ఆకాశము సంభవించినది' అని వేదమునందు చెప్పబడినది.

*సృష్టికి ముందునుంచి ఉన్నది ఆకాశము. అలాగే ఆత్మనుండే అన్నీ సంభవించాయి* అని వేదములు అన్నవి. ఆత్మనుండి అన్నీ అంటే ఆకాశం కూడా వేదమునుండి సంభవించినదే.

పరమాత్మయే మూలప్రకృతి. అనగా సృష్టికి ఆది పరమాత్మ. అట్టి మూలప్రకృతి నుండియే మహత్తత్త్వము, అహంకారము పంచభూతాలు ఉద్భవించాయి. అందులో ఆకాశంకూడా ఉన్నది. గనుక పరమేశ్వరి *వియత్ప్రసూః* అని యనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వియత్ప్రసవే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: