శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
శచీపతీ! వీరూ దేవతలేకదా! సూర్యనందనులు. సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి?
సంకర్తులు కారు. సూర్యుడికి ధర్మపత్నియందు జన్మించినవారే! ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం? ఈ విషయంలో నువ్వూ దేవతలూ అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి
సోమరపం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ వితతయజ్ఞం
జరిపించాను. అంచేత మాట నిలబెట్టుకోవలసిన అవసరం నాకుంది. దేవేంద్రా! ఈ ఇద్దరూ నాకు మహోపకారం చేశారు. ఈ రూపూ ఈ చూపూ ఈ వయసూ అన్నీ వారి వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం
చెయ్యడం నా ధర్మం నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డుచెప్పకు. అంగీకరించు అన్నాడు చ్యవనుడు. చ్యవనమహర్షీ! వీరు దేవవైద్యులు. సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం -ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు అహల్యాజారా! నిగ్రహించుకో. కోపం నిరర్ధకం. వృత్రమా! దేవవైద్యులైనంతమాత్రాన
సోమసురాపానం చెయ్యకూడదని ఎలా అంటావు ? సరియైన కారణం లేకుండా నిషేధించడం
సమంజసం కాదుగదా! అని చ్యవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఒక్కరుఉలకలేదు.
పలకలేదు. సూర్యసమతేజస్కుడైన చ్యవనభార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి