🌹భగవద్గీత🌹
మొదటి అధ్యాయము. అర్జునవిషాదయోగము నుండి 47 వ శ్లోకము. పదచ్ఛేద ,టీకా ,తాత్పర్య సహితముగా.
సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జునః సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ ౹
విసృజ్య సశరం చాపం
శోకసంవిగ్నమానసః ౹౹ (47)
ఏవమ్ , ఉక్త్వా , అర్జునః , సంఖ్యే ,
రథోపస్థే , ఉపావిశత్ ౹
విసృజ్య , సశరమ్ , చాపమ్ ,
శోకసంవిగ్నమానసః ౹౹ (47)
సంఖ్యే = రణభూమియందు ;
శోకసంవిగ్నమానసః = శోకాకులమనస్కుడైన ;
అర్జునః = అర్జునుడు ;
ఏవమ్ = ఇట్లు ;
ఉక్త్వా = పలికి ;
సశరమ్ = బాణములతోగూడిన ;
చాపమ్ = ధనస్సును ;
విసృజ్య = విసర్జించి ;
రథోపస్థే = రథముయొక్క వెనుకభాగమున ;
ఉపావిశత్ = చతికిలబడెను .
తాత్పర్యము :- సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్నమానసుడై , యుద్ధభూమియందు ధనుర్భాణములనu త్యజించి , రథము వెనుకభాగమున చతికిలబడెను. (47)
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః ౹౹౧౹౹
ఆత్మీయులందరికి శుభ శుభోదయం
Yours Welwisher
Yennapusa Bhagya Lakshmi Reddy
Advocate AP High Court Amaravathi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి