ఉ॥
వానలు వచ్చునప్పు డొకభంగి తుఫానులు వచ్చి గూల్చు నా
వానలు వోవుచున్ మరొకభంగిని గూల్చు నెమ్మెయిన్
వానలు మేలుసేయు నొక పద్ధతి వచ్చిన వేళ నా
వానలె కీడుసేయు మన పద్ధతి తప్పిన వేళ తప్పకన్
*~శ్రీశర్మద*
కం.వర్షములు గురియ సతతము
కర్షకులకు మేలొదవును కలిమి యొనర్చున్
హర్షము జనములు గన ప్రతి
వర్షము వర్షములు గురియ వర్ధిల్లగనౌ
కం.జలమున సంపద లెసగును
కలవరమును బాపు జనుల కాంక్షలు దీరున్
పలు విధముల నిల నెలవగు
కలిమికి మాగాణి జలము కలుగుటయ కవీ🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి