*కం*
అనుమానము పెనుభూతము
ననుబంధములంతమొనరు నవరోగంబౌ.
అనుమానము తలకెక్కగ(మదినిండగ)
యనురాగము లెంతవైన యంతమె సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అనుమానము అనే ది ఒక పెద్ద భూతమువంటిది.అది అనుబంధాలను అంతం చేసే కొత్త రోగము. అనుమానము మనస్సు లో నిండి తే ఎంతటి అనురాగాలైనా నాశనమౌతాయి.*
*కం*
నిక్కంబౌ అభిమానము
గ్రక్కున హితులందు తప్పు కనుగొనదెపుడున్.
టక్కరి స్నేహంబు లెపుడు
మిక్కిలి దోషం బులెంచు మిత్రుల సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నిజమైన అభిమానం తొందరపడి మిత్రుల లో తప్పు ను గుర్తించదు. మోసపూరితమైన స్నేహము లు మిత్రుల లో ఎక్కువగా దోషాలెంచును.
*సందేశం*:-- నిజమైన మిత్రులు తమ స్నేహితునిలోని తప్పు ను ఎప్పుడూ తప్పు గా భావించడు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి