శ్రీ కాళహస్తీశ్వర శతకం - 78
మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే
సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ
జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!*హ
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా!
నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైనా నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము.
నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను.
ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను.
జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ జన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి