29, ఆగస్టు 2023, మంగళవారం

అమ్మకడుపునుండి

 *సీసము*

అమ్మకడుపునుండి కమ్మంగనేర్చిన

   యమ్మవంటి కలిమి యాంధ్రభాష

ఆనందమందైన నావేశమందైన

  నావేదనందైన ననుగునైన

ఉత్సాహమందైన నుద్వేగమందైన

  కూర్మికైననుగాని పేర్మినైన

అంధులైననుగాని బంధుజనంబైన

   వితతమ్ము వాడెడి వెలుగు తెలుగు.

*ఆ.వె.*

ఎల్లవేళలందు నుల్లంబునందుండ

తెగడుచుండు జనుల తెగులు గాంచి

భావి చెరచ బడెడి బాలుర మదినెంచి

తల్లి వంటి తెలుగు తల్లడిల్లు.


*అందరికీ ప్రపంచ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: