అక్షరయాణ్ కవి సమ్మేలన్
అంశం : భాష
*కవి పేరు : తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*
---------------------------------------------------
*శీర్షిక : నా భాష నా యాస*
తెలుగు భాష యెంత అందంగా ఉందో
తెలంగాణ యాస అంత చందంగా ఉంది
వరసలతో పిలిచి వయ్యారంగా ఉంటది
పరాచకాలతో పరమాన్నం లాగుంటది
సామెతలతో గలిసి సభ్యంగా ఉంటది
తెలుగు భాషకు తెలంగాణ యాస సొగసు
ప్రాంతానీకో యాస, ఆత్మీయతల కోశం
ఎన్ని యాసలైనా తెలుగు భాష ఘనం.
అందమైన భాష శ్రీకరమైన యాస
ఆదరించి చూడ ఆకళింపు
ఆంద్ర తెలంగాణ అమ్మ భాష తెలుగు
అందరి ఆత్మకూ హత్తుకున్న యాస
అక్షరాల సొగసు చందమామను బోలు
అప్సరస నాట్యం చందాన చేవ్రాలు
అపురూపమైనదని కీర్తిగాంచిన భాష
ఆకర్షణీయమై అలరారిన యాస.
గిడుగు పట్టిన గొడుగు
వ్యవహారిక భాష తొడుగు
అడుగు అడుగున అమ్మ భాష
బుడి బుడి మాటల యాస
పండితుల భాష, పామరుల ఘోష
కాదు కారాదు అవమానమే యాస.
ఎందరో పంచిరి పద్య పరమాన్నాలు
ఎందరో మించిరి సహస్రావధానాలు
ఎందరో వెలిగిరి తెలుగు వెలుగు దివిటీలై
ఎందేందో పారింది తెలుగు మకరందమై
ఎచటెచటో ఎగిరింది భాషా విహంగమై
ఇంకెందరో పెంచిరి భాషాభిమానాలు
అందరికీ వందనాలు
తెలుగు భాషాభి వందనాలు, నా యాసాభి వందనాలు.
-------------------------------------------------------------- 30 లైన్స్
హామీ పత్రం: పై కవిత నా స్వీయరచన. భాష కవితా సంకలనం నిమిత్తమే రచించాను. ఏ ఇతర మాధ్యమంలోనూ ప్రసారం/ప్రచురితం కాలేదు మరియు ఎక్కడా పరిశీలనలోను లేదని హామీ ఇస్తున్నాను.
*కవి పేరు : తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*
చిరునామా : 4-116, దుర్గానగర్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాదు-500060
చరవాణి సంఖ్య : 9440710501
ఇమెయిల్ ఐడి : tjfnardhan@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి