27, అక్టోబర్ 2023, శుక్రవారం

కృత త్రేతా ద్వాపర కలియుగాలనే పేర్లకు

*!!ప్రశ్న!!* కృత త్రేతా ద్వాపర కలియుగాలనే పేర్లకు అర్థం ఏమిటి?!! 


*!!జవాబు!!* వాటి లక్షణాల ననుసరించి ఆ పేర్లు పెట్టబడ్డాయి.!!!! 


1... 'క్రియత ఇతి - కృతం' - యత్కృత్యం వర్తతే కృత యుగః.!! 

2... త్రీన్ ధర్మ పాదాన్ ఇతా (ప్రాప్తా) త్రేతా -!! 

3... ద్వాఖ్యాం కృతత్రేతాభ్యాం పరః!! 

4... కల్యతే (కలహం కుర్వంతీ త్యస్మిన్) ఇతి కలిః!! 


1.... 'చేయబడినది కృతం'. ఆ యుగంలో 'ఇది చేయి' అని బోధించవలసిన అవసరం లేదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ధర్మాలను ఆచరిస్తారు. అక్కడ ధర్మం 'కర్తవ్యం' కాదు. కృతం - సహజంగా ఆచరింపబడుతుంది. మహాత్ములకు ధర్మం సహజం. అందుకే అది కృతం. ఆ మహాత్ములున్న యుగమే కృతయుగం.!! 


2.... మూడు పాదములతో ధర్మములను పొందినది - త్రేతాయుగం. ఈ యుగంలో మూడు పాదములు మాత్రమే ధర్మం పూర్ణంగా ఉంటుంది కనుక త్రేతాయుగం.!! 


3.... కృత త్రేతాలనే రెండు యుగాల తరువాత వచ్చినది కనుక ద్వాపరం... ఈ యుగంలో రెండు పాదాలు మాత్రమే ధర్మం.!! 


4.... ఏ యుగంలో కలహం వ్యాపించి ఉంటుందో అది కలి యుగం... ఒకరంటే ఒకరికి పడకపోవడమే ఈ యుగ లక్షణం.!!

కామెంట్‌లు లేవు: