*2325*
*కం*
చదువుకొనెడి ప్రాయంబున
చదువొక కర్మంబెగాని చదువను మిషలన్
సదనుష్ఠానిత ధర్మము
వదులుకొనుట పాడిగాదు సతతము సుజనా.
(వదలగ నష్టమ్ము మనకె పదపడి సుజనా).
*భావం*:-- ఓ సుజనా! చదువుకునే వయస్సు లో చదువు ఒక కర్మ మే(పనియే) గానీ చదువు అనే మాయల చేత (సాకు చూపి) చక్కగా ఏర్పడి యున్న సదాచారమును వదులుకోవడం న్యాయం
కాదు. (సమాచారము ను వదులుకోవడం వలన నష్టము మనకే కలుగుతుంది).
*సందేశాత్మక హెచ్చరిక*:--- చాలా కాలం గా ఆంగ్లేయ విద్యాభ్యాసం మాయలో పడి కులవృత్తులనూ కుల ధర్మాలనూ దూరం చేసుకుని భారతీయులు ఎంతో నష్టపోతున్నారు,అదేదో ఘనకార్యం అనే భ్రమలో పడి ఈనాడు మరింత గా నష్టపోతున్నారు. (ముఖ్యంగా బ్రాహ్మణులు) సకాలంలో ఉపనయన,వివాహాది సంస్కారాలకు దూరమై,ఆహారవ్యవహారాదులు భ్రష్టమై, వేదశాస్త్రాలకు దూరమై భారతీయానికి భారమై అధోగతి పాలవుతున్నారు. తద్వారా విదేశీయులు భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి భారతీయులు భారత భూమి పై స్వాధీనం, స్వాతంత్ర్యం కోల్పోవడానికి మార్గం సుగమమవుతోంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి