25, మార్చి 2022, శుక్రవారం

సువిశాల విశ్వంలో

 " పవిత్ర పృధ్విపై స్థిరీకృతమైన ప్రకృతి ప్రసాదిత నిత్య సుచైతన్య సన్మైత్రీ  భావన "                                                       సువిశాల విశ్వంలో అనాదిగా నెలకొన్న జీవకారుణ్యతా మార్గం ! చరాచర జీవజాలం, అనునిత్యం ఒండొరులకు తోడూనీడగా వర్తించే ప్రధాన భూమిక ! సృష్టి రహస్యమైన " విశ్వ మానవాళి ప్రత్యేక ఆవిర్భావ సముచిత జీవన గమనం " ! సహజ సిద్ధమైన ప్రత్యేకతలతో సృష్టి ఆరంభంలో ఆవిర్భవించిన మహోన్నత ఓషధీ సంపద ! సకల జీవ సురక్షా విధమైన పరమ పవిత్ర వేద ధర్మ నిర్దేశిత సన్మార్గ, సుహృద్భావ నిత్య చైతన్య జీవన ప్రణాళిక ! విశ్వ మానవాళి అహర్నిశలూ చేయవలసిన సకల జీవజాతి సన్మార్గ పరిరక్షణ ! తమ నిత్య జీవన పయనంలో చూపాల్సిన సకల జీవ సంరక్షణా మార్గ సత్ చింతనాత్మక సహృదయ పవిత్ర దార్శనికత ! అనుమానావమానలకు తావు లేని, ఈర్ష్యా ద్వేష భావాలు కానరాని సక్రమ ప్రశాంత నిత్య సుచైతన్య దృక్పథ జీవన పంథా ! " బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే నిత్య సత్య సుచైతన్య స్ఫూర్తిమంతమైన సత్ చింతనాత్మక జీవన విధానం ! సన్మైత్రీ భావనాత్మక జీవకారుణ్యతా సన్మార్గ జీవన ప్రణాళిక, ప్రస్తుత నిత్య జీవన గమనంలో విశ్వ మానవాళి మనోఫలకంపై  ముఖ్య భూమికై నిలవాల్సిన తరుణమిది !                                          " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! "                                                 " సహనా వవతు ! సహనౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                                      " ఓం శాంతి శాంతి శాంతిః "                                                        రచన :                                                     గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: