1, అక్టోబర్ 2020, గురువారం

పుష్యమి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు

 


నక్షత్రములలో పుష్యమి 8వ నక్షత్రము. పుష్యమి నక్షత్రాధిపతి శని. గణము దేవగణము. అధిదేవత బృహస్పతి. 


పుష్యమి నక్షత్రము మొదటి పాదము

పుష్యమి నక్షత్రము మొదటి పాదములో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలి. పుష్యమి తొలి పాదములో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వేలుకు ధరించడం మంచిది. అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ. వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి.


63 నుంచి 69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ.. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69 నుంచి 79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ ఉంటుంది కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 


ఈ జాతకులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకు చదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా పైచదువులు కొనసాగిస్తే చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 ఏళ్ల అనంతరం వచ్చే కేతు దశలో వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. కేతు దశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్ర దశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. శుక్ర దశ నుంచి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.


పుష్యమి నక్షత్ర రెండవ పాదము

పుష్యమి నక్షత్ర 2 వ పాదం లోని జాతకుల జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్ర దశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ప్రతిభ సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. మేధస్సును ఉపయోగించే ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.


పుష్యమి నక్షత్ర మూడవ పాదము

పుష్యమి నక్షత్రము 3 వ పాదం నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవ గుణ ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధ దశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా సాగిపోతుంది. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు. నౌకా సంబంధిత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలమే. 


పుష్యమి నక్షత్ర నాలుగవ పాదము

పుష్యమి నక్షత్ర 4 వ పాదం నక్షత్ర అధిపతి శని. వీరి మీద కుజ శనిగ్రహ ప్రభావం ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందుంటారు. రెండు సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా ఉన్నత విద్యను కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు. 


కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలం.


పుష్యమి నక్షత్రము గుణగణాలు


శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యం నుంచి యవ్వనం వరకు కష్టపడి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణం. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. 


యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. వీరి జీవితం వివాహ అనంతరం గాడిలో పడుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు. కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .


వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే, శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. 


ఇక సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. 


వీరి అదృష్ట సంఖ్యలు: 2, 7....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: