5, జులై 2024, శుక్రవారం

ఔషధాల విభజన -

 ఆయుర్వేదం నందు ఔషధాల విభజన -


         ఆయుర్వేదం నందు కొన్ని రకాల ఔషధాలు శరీరం పైన అనేకరకాలుగా పనిచేయును . సాధారణంగా ఆయుర్వేద గ్రంథాలలో వాటి గురించి క్లుప్తంగా వివరిస్తారు. చరక మహర్షి వంటివారు అక్కడక్కడ కొంత వివరణ ఇచ్చారు . ఆయన ఔషధాలు పనిచేయు విధానాన్నిబట్టి యాభై గణాలుగా వర్గీకరించారు. 


           అటువంటి వర్గీకరణలు అందరికి అర్ధమయ్యేవిధముగా మీకు తెలియచేస్తాను.


 ఔషధ వర్గీకరణలు -


 * జీవనీయము -


           జీవమును వృద్ధిచెందించునవి.


 * బృoహ్మణీయము - 


           శరీరమును వృద్ధిపరచునవి.


 * లేఖనీయము - 


          శరీరం నందు వ్యర్ధపదార్ధాలను నివారించునవి.


 * బేధనీయము -


          గడ్డకట్టుకు పోయిన మలాదులు వంటి వ్యర్దాలను విడగొట్టునవి.


 * సంధానీయము -


          విడిపోయిన అవయవాలను అతుక్కొనే విధముగా చేయునవి .


 * దీపనీయము -


          జఠరాగ్నిని వృద్దిచెందించునవి .


 * బలీయము -


         బలమును వృద్దిచెందించునవి .


 * వర్ణ్యము - 


          శరీరముకు కాంతిని కలిగించునవి.


 * కంఠ్యము -


         కంఠమునకు మేలుచేయునవి .


 * హృద్యము -


         హృదయమునకు మేలుచేయునవి .


 * తృప్తిఘ్నము -


         శరీరంలో శ్లేష్మం వలన కలుగు వికారాలను నివారించునది.


 * ఆర్షోఘ్నము -


          మూలవ్యాధిని హరించునవి.


 * కుష్ఠఘ్నము -


          కుష్ఠు వ్యాధిని హరించునది.


 * కండుఘ్నము -


          దురదని హరించునది.


 * క్రిమిఘ్నము -


          క్రిములను నశింపచేయునది .


 * విషఘ్నము -


          విషాదోషములను హరించునది.


 * స్తన్యజననము -


          స్తన్యమును కలిగించునది.


 * స్తన్య శోధనము -


           స్తన్యమును శుభ్రపరచినది.


 * శుక్ర జననము -


           శుక్రమును అనగా వీర్యమును పుట్టించునది.


 * శుక్ర శోధనము -


          శుక్రమును శుద్ధిచేయునది .


 * స్నేహోపగము - 


          తైలకర్మకు ఉపయోగించునది .


 * స్వేదోపగము -


         స్వేదకర్మ యందు ఉపయోగపడునది.


 * వమనోపగము -


         వమనకర్మ అనగా వాంతి చేయుటకు ఉపయోగపడునది .


 * విరేచనోపగము -


         విరేచనం చేయుటకు ఉపయోగపడునది .


 * ఆస్థానోపగము -


         వస్తికర్మ యందు ఉపయోగించబడునది .


 * అనువాసనోపగము -


         అనువాసనవ వస్తికర్మకు ఉపయోగపడునది .


 * శిరోవిరేచనము -


          దగ్గును హరించునది.


 * ఛర్ధి నిగ్రహము -


         శ్వాస కర్మ యందు ఉపయోగించునది .


 * తృష్ణనిగ్రహము -


          తృష్ణ కర్మ యందు ఉపయోగించతగినది.


 * హిక్కా నిగ్రహము -


         వెక్కిళ్ళను పోగొట్టునది.


 * పురీష సంగ్రహాణీయము -


         మలమును గట్టిపరుచునది.


 * పురీషవిరజనీయము -


         మలాశయం నందలి దోషములను నివారించునది .


 * మూత్రసంగ్రహనీయము -


          మూత్రమును ఆపునది.


 * ముత్ర విరజీయనీయము -


        మూత్రదోషములను పోగుట్టునది.


 * మూత్రవిరేచనము -


        మూత్రమును విడుదల చేయునది .


 * కాసహరము - 


         దగ్గును పోగొట్టునది .


 * శ్వాసహరము -


        శ్వాసను హరించునది .


 * శోథ హరము -


       వాపును నాశనం చేయునది .


 * జ్వర హరము -


       జ్వరములను పోగొట్టునది .


 * శ్రమ హరము -


       శరీరం అలసటను పోగొట్టునది .


 * దాహ ప్రశమనము -


        తాపమును హరించునది.


 * దాహప్రశమనము -


        తాపమును హరించునది.


 * శీత ప్రశమనము -


       శీతమును నివారించునది.


 * ఉదార్ధ ప్రశమనము -


       శరీరం పైన ఎర్రని దద్దుర్లను నివారించునవి.


 * అంగమర్ద ప్రశమనము -


        బడలిక నొప్పులను పోగొట్టునది .


 * శూల ప్రశమనము -


        శూలను హరించునది.


 * శోణిత స్థాపనము -


        రక్తమును నిలుపునది .


 * వేదనాస్థాపనము -


        భాధను తొలగించునది .


 * సంజ్ఞా స్థాపనము -


       స్మృతిని కలుగచేయునది అనగా మూర్ఛపోయిన వారికి తెలివితెప్పించునది .


 * ప్రజాస్థాపనము -


       సంతానమును కలిగించునది.


 * వయస్దాపనము -


       వయస్సును స్థాపించునది . అనగా వయస్సును నిలుపునవి.


        పైన చెప్పినటువంటి పద గణములు అన్నియు తరచుగా ఆయుర్వేద గ్రంథాలలో తరచుగా వినిపించును. కావున వీటిపైన అవగాహన కలిగి ఉండవలెను .


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: