🙏🏻 *వారాహీ నవరాత్రులు జూలై 6 నుండి ప్రారంభం*🙏🏻
**************************
వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.
**************************
ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా.
**************************
శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.
**************************
*విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్!*
*అనేక రూపదైత్యాన్తం నమామి పురుషోత్తమమ్!!*
**************************
విశ్వవ్యాపకుడు, జయశీలుడు, మహావిష్ణువు, ప్రకాశశీలుడు, సర్వ శాసకుడు, అనేక రూపములతోనున్న దైత్యులను నశింపజేసే బహు అవతార స్వరూపు డైన పురుషోత్తముని నమస్కరించుచున్నాను. ***************************వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు*
**************************
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
**************************
నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
**************************
**************************🕉️ *శ్రీ మాత్రే నమః*🕉️
---------------------------------------- 🔯 *వారాహీదేవి*🔯 **************************
కదిలే దేవత... వారాహీ...
👉కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.
🙏🏻జై మాతా🙏🏻 **************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి