5, జులై 2024, శుక్రవారం

యుగానుసారం

 🌷 *యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు🌷* 


కృతయుగం – మనుస్మృతి

త్రేతాయుగంలో – గౌతమ స్మృతి

ద్వాపరంలో – శంఖు స్మృతి

కలియుగం – పరాశర స్మృతి


ఇవీ యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు ( ధర్మ స్మృతులు )


ఏరోజైతే భగవంతుని గురించిన ఙ్ఞానం తెలుసుకోవాలనే తపన మనలో మొదలైతే ఆ కృష్ణపరమాత్ముడు తప్పకుండా తగు ఏర్పాట్లు చేస్తాడు అది ఏవిధమైన ఏర్పాటైనా కావొచ్చు !! అందుకే అంటారు మనం భగవంతుని వైపు ఒక అడుగు ముందుకేస్తే ఆయన పదడుగులు వేయడానికి ఏమాత్రం సంకోచించడు పైగా ఎంతో ఆదుర్దగా వస్తాడు !! ఉదా: శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం


*******************************************


పరాశర స్మృతి


ధర్మశాస్త్రాలు(స్మృతులు) అన్ని యుగాలకి ఒకే స్మృతి నిర్దేశంచబడలేదు.!! ఆ వివరాలు పరాశర మహర్షి విరచిత “పరాశర స్మృతి” లో వివరించారు


సత్య (కృత) యుగం – మనుస్మృతి

త్రేతా యుగం – గౌతమ స్మృతి

ద్వాపర యుగం – శంఖ స్మృతి

కలియుగం – పరాశర స్మృతి

కావున కలియుగానికి అనుసరణీయమైన ధర్మ శాస్త్రం “పరాశర స్మృతి”


ఇంకా పరాశర స్మృతిలో ఏయే యుగంలో ధర్మాచరణ ఏయే విధంగా జరగాలో ఈ కింది విధంగా వివరించబడింది


“తపః పరం కృతయుగే

త్రేతాయాం ఙ్ఞానముచ్యతే

ద్వాపరే యఙ్ఞమిత్యుహ

దానమేకం కలౌ యుగే” అనగా


కృతయుగం – తపస్సు చేయడం

త్రేతాయుగం – ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని పొందడం

ద్వాపరయుగం – యఙ్ఞ, యాగాదులు చేయడం

కలియుగం – భగవత్సంబంధిత కార్యాలకై దాన దర్మాలు చేయడం


ఇంకా దానం కూడా ఏయే యుగాలలో ఏయే విధంగా చేసేవారో కూడా పరాశర స్మృతి వివరిస్తుంది


కృత యుగం – దాత (donar) దాన గ్రహీత అందుకు అర్హుడేనా అని విచారించి

త్రేతాయుగం – దాత దానగ్గహీతను అభ్యర్థించి (request)

ద్వాపర యుగం – దాన గ్రహీత కోరినది దానం చేయడం

కలియుగం – ప్రత్యక్షంగా సహాయం చేయలేని పక్షంలో బదులుగా ద్రవ్య రూపకంగా

(charities are provided in the lieu of service rendered)


*****************************************

విష్ణు పురాణం


పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి బోధించిన పురాణమే “విష్ణు పురాణం”

వీరు సాక్షాత్తు వేద వ్యాసుల వారికి తండ్రి గారు మరియు శక్తి మహర్షి పుతృడు మరియు వసిష్ఠుల వారి పౌతృడు ( మనుమడు)

*******************************************


హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ

పై శ్లోకము కృష్ణయజుర్వేదాంతర్గత కలిసంతరణ ఉపనిషత్ లోనిది

కామెంట్‌లు లేవు: