5, జులై 2024, శుక్రవారం

రామాయణాన్ని

 🌷 జై శ్రీ రామ్ 🌷


           రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ. సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం. ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంటుంది.


కాని రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే మానవునిలోని రజో, తమో గుణాలు. ఈ రజో, తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచాయి. అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపు మాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకం.


ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతమ్మకు మార్గమేర్పడుతుంది. అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది...


🙏 జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ 

🙏

కామెంట్‌లు లేవు: