ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శ్లోకం:43/150
వృత్తావృత్తకరస్తాలో
మధుర్మధుకలోచనః I
వాచస్పత్యో వాజసనో
నిత్యమాశ్రితపూజితః ॥ 43 ॥
* వృత్తావృత్తకరః = యుద్ధభూమిలో రథంలో మండలాకారం ఏర్పరచటం - వృత్తం,
శత్రుసైన్యాన్ని నశింపజేసి, ఎట్టి గాయం లేకుండా తిరిగిరావడం - ఆవృత్తం,
ఈ రెంటినీ నైపుణ్యంగా చేయువాడు,
* తాలః = (సంగీతశాస్త్రమునందలి) తాళ స్వరూపమైనవాడు,
* మధుః= వసంత ఋతురూపుడు,
* మధుకలోచనః = తుమ్మెదలవంటి (నల్లని) కనుపాపలు కలవాడు,
* వాచస్పత్యః = వాగ్దేవియొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు,
* వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడయినవాడు,
* నిత్యమాశ్రితపూజితః = ఎల్లప్పుడూ, తనను ఆశ్రయించినవారిచేత పూజింపబడువాడు.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి