🌹🌹 *సుభాషితమ్* 🌹🌹
--------------------------------------------
*శ్లోకం*
ఏకోహం అసహాయోహం
కృశోహం అపరిచ్ఛదః |
స్వప్నేప్యేవం విధా చింతా
మృగేంద్రస్య న జాయతే ||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
నాతో ఎవరూ లేరు, నేనొక్కడినే ఉన్నందున అసహాయకుడినై ఉన్నాను. చాలా కృశించి పోయాను. నావద్ద ఎలాంటి ఆయుధాలూ లేవు. నా గతి ఇక అధోగతి - ఈ రకమైన ఆలోచన మృగరాజైన సింహానికి కలలో కూడా రాదు. అది తనలోని ప్రయత్నం, పరాక్రమాల ద్వారా సాధించి గెలుస్తుంది. అలాగే మనిషి కూడా దేవుడిని స్మరిస్తూ ప్రయత్నపూర్వకంగా యుక్తిశక్తుల ద్వారా సాధించి ఫలితాన్ని పొందాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి