🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*
*సీతారామాంజనేయ సంవాదము.*
*ప్రథమాధ్యాయము*
*భాగము - 5*
శా. లోకాలోక పరీతభూచర మహా; లోకోపకారంబుగా
శ్రీకల్యాణకరోరు కావ్యచయముల్; సిద్ధంబు గావించి సు
శ్లోకుల్ పుణ్యమతుల్ జగద్గురువులై; శోభిల్లుచున్నటి వాల్మీకివ్యాసమయూర బాణకవికా; ళీదాసులంగొల్చెదన్.
తాత్పర్యము:.
ఇహపరాలనందించ వీలుగా, తమ అద్భుత కవితాశక్తిని పురాణ - ఉప పురాణేతి లోకులనెల్ల పావనము చేయు దివ్యశక్తిమూర్తులుగా విలసిల్లి,
తమ సనాతన సదాచార సంపత్తితో, సర్వులు తరించు అనుగ్రహమొసగిన సుశ్లోకులు,
జగద్గురువులు శ్రీ వాల్మీకి, వ్యాస, కుమార, బాణ, కాళిదాసాది మహాకవులకు శిరసువంచి నమస్కరించి,
ఈ గ్రంథ రచనకు వారి కరుణ నభ్యర్థిస్తున్నాను.
గీ. మహిత గురులఘువర్ణ ధర్మములు నియమ
ములుఁ గలిత కర్తృ కర్మ క్రియలును దెలిసి నామరూపావ్యయ విలక్షణంబు లాత్మ
నెఱిఁగిన కవీశ్వరుండె కవీశ్వరుండు.
తాత్పర్యము:.
అసలు “కవి" అంటే, గురు లఘువులు, కావ్య ధర్మములు, కర్త కర్మ క్రియల ఉపయోగములు, విషయం చెప్పడంలో విశ్రుతానుభవము, స్పష్టత లేక "కవి"నన్నా కవిత్వము చెబుతానన్నా అది "కవి"పీడగా వుంటుంది.
అందులో ఛందో బద్ధ వ్యాకరణాది నియమ నిబంధనలు, విషయ సరళతలు కనుపించవు.
అలాగే సమాజిక దృష్టిలో కనుక ఆలోచిస్తే - ఈ భూమి మీద గురువులు - ముందు బ్రాహ్మాణులు.
ఆ తదుపరి వారి వారి వర్ణ సేవస్థ లక్షణాలు, తక్కువ జాతి, ఎక్కువ జాతిగా విఖ్యాతమవ తలవడమో
లేక ఎక్కువ జాతి వారు తక్కువ జాతి నీవంటూ తూలనాడి క్రింద పడిపోవడమో, ఇది సామాజిక వ్యవస్థకు విఘాతమయ్యే వ్యవస్థ.
సమాజంలో అందరు ఆ దైవ ప్రియులుగా సద్ధర్మ సనాతనామూర్తులై, తమ తమ ధర్మములు సశాస్త్రీయంగా
కులమతాల ప్రాంతీయ భేదాల అసమానతలు తొలగి "సర్వేజనాః సుఖినోభవన్తు" శాశ్వతమవుతుంది. లోకాన్ సమస్తాన్ స్సుఖినో భవన్తు" నిత్యమవుతుంది.
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి