*1829*
*కం*
మనమేగతి(మనమేస్థితి)యందున్నను
మనసును సంతృప్తి వైపు మలచగ నెపుడున్
మనమోదమె యాదర్శము
మనమే సద్గురువులమగు మహిలో సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనం ఎటువంటి స్థితి లో ఉన్న నూ మనస్సు ను సంతృప్తి పడేలా మలచుకొనగలిగితే మన సంతోషమే ఆదర్శ కరమై మనమే ఈ భూలోకంలో మంచి గురువులము కాగలము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి