బ్రహ్మగారి మీద బ్రహ్మాండమైన పద్యాన్ని అందించి , సకలజనులకు సంతోషం కలిగించాడు పొతన. లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే విష్ణుమూర్తిని కూడాప్రసన్నం చేసుకోవాలంటారు. అలాగే సరస్వతీ కటాక్షానికి బ్రహ్మగారిని భక్తితో సేవించాడు . ఎవరిని సేవించినా, ఎవరిని కొలిచినా, ఎవరిని పిలిచినా
ఆ ఆకారాన్ని కళ్లముందు నిలపడమే పోతన రచనా శైలిలోని మహాద్బుతం
*****
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
*****
చరాచర జగత్తునంతా చక్కగా సృష్టించే నేర్పరికి, సరస్వతీదేవి హృదయానికి సంతోషం చేకూర్చువానికి, వేద రాశిని సమకూర్చిన వానికి, సమస్త దేవతా బృందానికి నాయకుడై తీర్చిదిద్దువానికి, భక్తుల పాపాలను పోగొట్టే వానికి, దీనజనులను ఓదార్చువానికి, తపోధను లందరికీ శుభాలు చేకూర్చువానికి,... ఆ బ్రహ్మదేవుని అనంత భక్తి తో సంసేవిస్తున్నాను.
🏵️*పోతన పద్యం సర్వపాప హరం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి