10, ఆగస్టు 2024, శనివారం

శ్లోకం

 👆శ్లోకం 

మహేశ్వాసో మహీభర్తా                          

శ్రీనివాసః సతాంగతిః |                       

అనిరుద్ధః సురానందో                        

గోవిందో గోవిదాం పతిః ||


ప్రతిపదార్ధ: 


మహేష్వాసః -తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.

మహీభర్తా -భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.

శ్రీనివాసః -సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.

సతాంగతిః -సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

అనిరుద్ధః -ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.

సురానందః -దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.

గోవిందః -దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.

గోవిదాం పతిః - వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.

కామెంట్‌లు లేవు: