కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట.
కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.
జన్మకి కారణం కర్మ.
జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.
సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.
కర్మ నిశ్శేషమే మోక్షం.
కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.
ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX.
కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.
కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.
భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.
నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు.
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.
సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .
ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.
ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.
NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.
మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా
విభజించారు .......
1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.
పూర్వజన్మలో మన్నించడానికి ఏ మాత్రం
వీలులేని ఘోర తప్పిదం చేసినవాళ్ళు -
"ధృత కర్మ" విభాగంలోకి వస్తారు ....
ఒకరిని హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ ఈ భాగంలోనే వస్తాయి.
వీళ్ళు ఆ తప్పుకు శిక్షను అనుభవింల్సిందే ఎంత శాంతి చేసినా ఏమి ఫలితం ఉండదు,
ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని చెప్పటంతో అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం.
ఇక మూడవది అధృత కర్మ. పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి