10, ఆగస్టు 2024, శనివారం

సుందరాచారి జన్మదినం

 ఈ రోజు శంకరం బాడి సుందరాచారి జన్మదినం 

    (10-08-1914) 


            తెలుగు తల్లికి మల్లెపూదండవేసి అక్షరాలతో అర్చన చేసిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన శంకరం బాడి సుందరాచారి. వీరు 1914 ఆగస్ట్ 10 న జన్మించినారు. వీరి మాతృ భాష తమిళం. కడుపేదరికంతో ఎన్నో కష్టాల కోర్చి, వాటిని ఇష్టాలుగా మార్చుకొని ఆత్మ విశ్వాసం తో ముందుకు నడిచిన మహనీయుడు.

     వీరికి పద్య కవిత్వమ0టే చాలా ఇష్టం. అందులో "తేటగీతి "ఆయన ఇష్టపడ్డ చందస్సు. మన రాష్ట్ర గీతమైన "మాతెలుగు తల్లికి మల్లె పూదండ " గీతాని తేట గీతి చందస్సు లో రచించారు. వీరి రచనలలో ముఖ్యమైనవి బలిధానం, రవీంధ్రుడి గీతాంజలి అనువాదం, సుందర భారతం, శ్రీనివాస శతకం, సినిమాపాటలు.

       మాతెలుగు తల్లికి మల్లె పూదండ గీతాన్ని 1942 లో "దీనబందు " సినిమా కోసం రచించాడు. అలనాటి ప్రముఖ గాయిని టంగుటూరి సూర్యాకుమారి. ఈమె టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడైన శ్రీరాములు కుమార్తె. ఈమె 1972సం " లో గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం మధురంగా పాడిన తరువాతనే ఈ పాటకు గుర్తింపు వచ్చింది. శంకరంబాడి వారిని శ్రీ వెంకటేశ్వర విశ్వావిద్యాలయం వారు "ప్రసన్న కవి "అనే బిరుదు ఇచ్చి గౌరవీంచినారు.  1977 ఏప్రిల్ 8న తిరుపతి లో వారు నివాసం ఉంటున్న ఇంట్లో కాలం చేసినారు. ఈ మహనీయునికి నివాళులు అర్పిస్తూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


        -- *ఇందిరా బాలాజీ రావు కోన*

కామెంట్‌లు లేవు: