ప్రశ్న పత్రం సంఖ్య: 35 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
మిత్రులారా ఇక్కడ మనం చాలా కాలం తరువాత కలుసుకుంటున్నాం. క్రింద ఇచ్చిన సరదా ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి. ( ఈ ప్రశ్నలు ఎవరిని బాధించటానికి వ్రాసినవి కావు కేవలం సరదాగా మాత్రమే తీసుకోండి)
1) ఇంట్లో ఈగల మోత వీధిలో
i ) విమానాల మోత ii ) విసనకర్రల మోత iii )పల్లకీల మోత iv ) కార్ల మోత
2) ఏదయినా కార్యక్రమం చేయించేటప్పుడు బ్రాహ్మడికి వీపు దురద పుడితే దీనితో గోక్కుంటారు.
i ) దర్భలతో ii ) ఉద్దరాణితో iii ) జంద్యంతో iv ) పీటతో
3) తిన తిండిలేదు మీసాలకు
i ) వేప నూనె ii ) సంపెంగి నూనె iii )పల్లి నూనె iv ) ఆవ నూనె
4) బ్రాహ్మణ ఇంటిలోకి దొంగలు రాకుండా ఇది కాపాడుతుందని అనుకునే వారు.
i ) చింపిరి పుల్ల ii ) ప్రక్క వారింటిలోని కుక్క పిల్ల iii ) తిని పారేసిన విస్తరాకు iv ) దండెం మీది మడిబట్ట
5)వింటే భరతం వినాలి తింటే
i ) గారెలే తినాలి ii ) మిర్చి బజ్జిలే తినాలి iii ) శనగలు తినాలి iv ) పరమాన్నం తినాలి
6) తాడి తన్నేవాడుంటే వాడి .
i ) కాళ్ళు తన్నే వాడుంటాడు ii ) చెయ్యి తన్నే వాడుంటాడు iii ) ముక్కు తన్నే వాడుంటాడు iv ) తల తన్నే వాడు ఉంటాడు
7) ధోవతి ఇంకొక పేరు
i ) పైజామా ii ) పంచ iii ) దుప్పటి iv ) రుమాలు
8) రామాయణ మహా భారతాలను ఇలా కూడా అంటారు
i ) ఇతిహాసాలు ii ) పరి హాసాలు iii ) హాసాలు iv ) నవ హాసాలు
9) పూర్వం టేపు రేకార్ధరు రాక ముందు వినటానికి దీనిని పాటలు ఉపయోగించే వారు
i ) సెల్ ఫోను, ii ) గ్రామఫోను iii ) ల్యాండ్ ఫోను iv ) పెన్ డ్రైవ్
10) నోరు మంచిదయితే
i ) చెరువు మంచిదైతుంది ii ) కారు మంచిదైతుంది iii ) ఊరు మంచిదవుతుంది iv ) పేరు మంచిదవుతుంది.
11) పూర్వం మన దేశంలో స్త్రీ పురుషులు ఒకే రకమైన వస్త్రాన్ని ధరించే వారు అది
i ) కొక ii ) పైజామా iii ) పంజాబీ డ్రస్సు iv ) రుమాలు
12) పూర్వము పిండి చేయటానికి ఈ సాధనం వాడే వారు
i )అట్లకాడ ii ) మూకుడు iii ) విసుర రాయి iv ) పాట కారు
13) అనువుకాని చోట ఇలా అనరాదు
i ) ధనవంతుడ ii ) అధికుల iii ) జమిందార్ iv ) రాజు
14) ఉట్టి కెక్కలేనమ్మా
i ) కొండ ఎక్కినట్లు ii ) స్వర్గానికి ఎక్కినట్లు iii ) గోల్కొండ ఎక్కినట్లు iv ) నిచ్చెన ఎక్కినట్లు
15) ఈ రోజుల్లో సాధారణంగా ప్రతివారి ఇంట్లో ఇది ఉంటుంది
i ) కుంపటి ii ) గ్యాసు స్టౌవు iii ) పొట్టుపొయ్యి iv ) కట్టెల పొయ్యి
16) అన్నిదానముల కన్నా
i ) పెన్ను దానము మిన్న ii ) సున్నం దానం మిన్న iii ) భూదానం మిన్న iv ) అన్నదానము మిన్న
17) ఉపనయనం ఐన బ్రాహ్మలు విధిగా ఇది పట్టాలి
i ) చీపురు ii ) ఔపోసన iii ) శనగలు iv ) రోకలి
18) అమృత మస్తు అని బ్రాహ్మలు ఎప్పుడు అంటారు
i ) తినే ముందు ii ) త్రాగే ముందు iii ) వాగే ముందు iv ) వాదులాడే ముందు
19) చెరపకురా
i ) పడవు ii ) చేడేవు iii ) కడిగేవు iv ) అడిగేవు
20)
మనం లక్ష్మి పూజ చేయాలంటే ముందుగా ఈ పూజ చేయాలి
i ) రాముని పూజ ii ) సీతాదేవి పూజ iii ) గణపతి పూజ iv ) నైవేద్యం పూజ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి