తెలుగు పుస్తకాలు ఉచితంగా లభించే వెబ్‌సైట్లు (Websites To Download Telugu Books For Free)
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా1 ప్రాజెక్ట్ భాగంగా, భారతదేశంలోని పలు విద్యా సంస్థలు పబ్లిక్ డొమైన్ పుస్తకాలను డిజిటైజ్ చేశాయి. ఈ సైట్ లో ఉచితంగా చదవడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి 40,000 కు పైగా తెలుగు పుస్తకాలు ఉన్నాయి.
ఉచిత భక్తి పుస్తకాలు
సాయి రామ్ ఆటిట్యూడ్ మానేజ్మెంట్ వారు అంతర్జాలంలోని(ఇంటర్నెట్) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేని భక్తి పుస్తకాలను సేకరించి ఉంచారు. ఇందులో 4200 లకు పైగా పుస్తకాలు వున్నాయి.
pusthakalu.com
స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం, pusthakalu.com లో తెలుగు సాహిత్యానికి సంబందించిన 1800 లకు పైగా పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు.
TTD ePUBLICATIONS
తిరుమల తిరుపతి దేవస్థానం వారు 750 కు పైగా పుస్తకాలను, వార పత్రికలను సేకరించారు. ఇందులో దాదాపు 500 ల పుస్తకాలు తెలుగులో వున్నాయి.
Kinige
కినిగె వెబ్ సైట్ లో దాదాపు 400 ఉచిత పుస్తకాలు వున్నాయి.
Telugu Thesis
పాండు రంగ శర్మ అను ప్రొఫెసర్ 2007 నుంచి అంతర్జాలంలోని వివిధ సైట్ల నుండి దాదాపు 400 పైగా పుస్తాకాలు సేకరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి