10, జులై 2021, శనివారం

కొవ్వు గురించి విశేషాలు - 2

 శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు - 2 . 


 *  కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది  

 

 *  కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి. 


       *  శాచురేటేడ్ ఫాట్ 

       

       *  అన్ శాచురేటెడ్ ఫాట్ . 


 *  శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది  . ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 


 * అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును. 


 *  మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును . 


 *  ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును . 


 *  కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం . 


 *  శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది . కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును. 


 *  కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును. 


 *  కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును. 


 *  30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్ 

150 m/g  dl లోపల ఉండాలి . 


 *  30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్ 

 180 m/g dl లోపల ఉండవలెను . 


 *  ఏ వ్యక్తిలో నైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు. 


                             సమాప్తం 


     పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: