*దేవుడు అడగని ప్రశ్నలు .⁉️*
*మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు .*
*నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు .*
*నీది ఎన్ని అంకెల జీతం ? అని దేవుడు అడగడు .*
*నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది ?అని అడుగుతాడు .*
*నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు ? అని అడగడు .*
*నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలగుతున్నావని అడుగుతాడు .*
*నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు .*
*నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .*
*నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు .*
*నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు .*
*నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు .*
*నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు ? అని అడుగుతాడు .*
*నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు .*
*నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .*
*నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .*
*ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .*
*ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని దేవుడు అడగడు .*
*నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి