10, జులై 2021, శనివారం

పశ్యన్ జన్మాని సూర్యః

 పశ్యన్ జన్మాని సూర్యః అని మహా సౌరంలోగల అరుణ మంత్రం తెలుపుచున్నది. దీనికి మూలం అణువు సప్త వ్యాహృతమై సప్త సంఖ్యకు మూలమైన సంఖ్య 7 వ్యాహృతులు 79°E అక్షాంశము వద్ద గల కాశ్మక్ జీవ తత్వమైన శివ/విష్ణు రూపమైన మార్పు చెందిన శక్తియే. అది సూర్యశక్తిని ప్రధానము చేసుకొని యీ అక్షాంశం వద్ద శక్తని కలిగియున్నదని మహర్షులుఆచరణలో భౌతికంగా ఆలయాల రూపంలో తెలిపారు. దానిని విలక్షణమైన పదార్ధ రూపంలో యనగా మార్పు చెందుతూ శక్తిని భద్రపరచి యున్న పదార్ధ తత్వంగా తెలియును. దానిని గ్రహించుటకై యనగా పశ్యతి దర్శించుటకు బాహ్య/ అంతర్ముఖం గా సూత్రము జీవుడని నిర్వచనం. జీవుని తత్వమును యింత స్పష్టంగా సూర్య శక్తిని తెలుపుచున్నది. అగ్నీశ్ఛ జాత వేదాః. అగ్ని తత్వము ఈశ్వర తత్వము  వేదమని. వేదమనగా  విశిష్ట తత్వమును సమ్యక్ దృష్టితో తెలుపు సూత్రము. నిశిత పరిశీలన వేదమని తెలుపుచున్నది. అది చూచుటయను ప్రక్రియ ఆఖరి వంతు సూక్మంగా పరమాణు రూపముగా తెలియుటయనే లక్షణము. అదియును స్వల్పమే. అనంతమైన శక్తిని  స్వల్పంగా సూక్షమంగా రూప పరిమాణముగా మాత్రమే లక్షణ,రంగు, రూప రస, ప్రకారముగా తెలియుచున్నది. అది జీవ తత్వం.అణు శక్తియే సూర్య పరమైన జీవ శక్తి. మనకు ఏమీ తెలియనప్పుడు శరణాగతి మాత్రమే.శరణాగతికి మూల తత్వము ఎవరో వారిని, అదియును ఙ్ఞానముద్వారా  తెలియుట కొరకు  మాత్రమే. సంహిత, సంహితము పూర్ణ తత్వ ఙ్ఞానమును క్రమ పద్ధతిలో తెలుపుటకు సూత్రము. సర్వు లలో యున్న పూర్ణమైన హితమైన తత్వము. అనగా మూల తత్వం. సత్ హితము  సహితము లో ౦ పూర్ణము లేదు. సంహితము పూర్ణమై యున్నది యని తెలియుట ఙ్ఞానము. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: