20, నవంబర్ 2023, సోమవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 91*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 91*


శ్రీరామకృష్ణుల పావన భౌతికకాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికలు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు.


 ముప్ఫై మూడేళ్లు మాత్రమే నిండిన మాతృదేవి ఆ సాయంత్రం వితంతు వేషధారణకు ఉపక్రమించారు. కాని ఆమె భర్త మరణించారా? ఆయన అమరులు కదా! మాతృదేవి తమ బంగారు గాజులు తీసివేయబోతున్నప్పుడు ఆమె ఎదుట శ్రీరామకృష్ణులు సాక్షాత్కరించారు: 

 

"నేను మరణించాననా నీ సుమంగళీ వేష ధారణను తీసివేస్తున్నావు? నేను మరణించలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాను" అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని నిలిపివేశారు. ఆ తరువాతి రోజుల్లో మళ్లీ రెండుసార్లు - మాతృదేవి తమ గాజులు తీసివేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా గురుదేవులు మునుపటి మాదిరే ప్రత్యక్షమై ఆ ప్రయత్నాలను వారించారు. 


ఆ తరువాత మాతృదేవి గాజులను, సన్నని అంచుగల చీరను ధరించి నిత్యం సుమంగళిగానే జీవించారు.


కాశీపూర్ శ్మశానం నుండి శ్రీరామకృష్ణుల అస్థికలను ఒక కలశంలో సేకరించి దానిని మోసుకొని కాశీపూర్ ఉద్యాన గృహం చేరుకొన్నారు భక్తులు. "భగవాన్ శ్రీరామకృష్ణదేవకీ జై" అనే నినాదంతో దానిని శ్రీరామకృష్ణుల మంచం మీద ఉంచినప్పుడు, శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకొన్నా, వారి మనస్సులను శూన్యం ఆవరించింది. 


కాని వారు, ఆయన జీవితకాలంలో ఎలాంటి వినాశం లేని ప్రేమతో పెనవేసుకొని ఉన్నారో అదే ప్రగాఢ ప్రేమ  ఇప్పుడు సైతం వారిని పెనవేసి ఉంచింది. ఒకే లక్ష్యంతో జీవించిన వారు పరస్పరం సాంత్వనపరచుకొంటూ, మెల్లగా తేరుకొంటూ గట్టి నమ్మకంతో ముందుకు సాగారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: