అద్వైత వేదాంత పరిచయం
6.2.1 అనుద్వేగకరం - బాధించనిది :- మన మాటలు ఎవరినీ బాధించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మాటల స్థాయిలో అహింసని పాటించటం మొదటిమెట్టు. తిట్టటం,
విమర్శించటం, నిందించటం, కించపరచటం, వాదించటం లాంటివన్నీ హింసకిందకి వస్తాయి.
ఏది బాధిస్తుందో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒకటే మార్గం
ఉంది. మనని ఎవరైనా ఏది అంటే మనని బాధిస్తుందో, అది ఎదుటివారిని కూడా బాధిస్తుంది. ఏది బాధిస్తుందోఅది అనకుండా ఉండటానికి ప్రయత్నించాలి.అలా కుదరని పక్షంలో కనీసం
బాధించే అంశాన్ని తగ్గించాలి, శరీరాన్ని కోసేముందు బాధ తెలియకుండా ఉండటానికి డాక్టరు మత్తుమందు యిచ్చినట్టుగా.
6.2.2 సత్యం - నిజం :- సత్యం అంటే నిజం చెప్పటం. బ్రహ్మన్ లేదా దేవుని చేరుకోవటానికి అత్యంత ముఖ్యమైన నియమం ఇది. సత్యం చెప్పటం ద్వారా మనం అంతిమ సత్యమైన
బ్రహ్మన్‌ని చేరుకోవచ్చు.
ప్రాపంచిక స్థాయిలో సత్యం చెప్తే, ఆధ్యాత్మిక స్థాయిలో సత్యానికి చేరువవచ్చు. ప్రాపంచిక సత్యం వాక్‌తపస్సు, ఆధ్యాత్మిక సత్యం భగవానుడు, అందువల్ల మనమాడే
ప్రతి అబద్ధమూ మనని దేవునికి దూరం చేస్తోంది.
అసతోమా సద్గమయా: ఓ దేవా! నన్ను అసత్‌కి దూరం చేయి.ఎటువంటి అసత్యమాడినాప్రతిఅసత్యమూ మనని భగవంతునికి దూరం చేస్తుంది.మన మనసుని ఎంతగా
సున్నితపరచుకోవాలంటే, మనం చెప్పే ప్రతి ఒక్క అబద్ధమూ మనని బాధించి, ఆ బాధ చిరకాలం ఉండేలాచేయాలి. అబద్ధం ఆడటం వల్ల కలిగే బాధ ముందు, అది ఆడితే కలిగే లాభం
వీగిపోవాలి.
అప్పుడు మన ప్రమేయం లేకుండానే మనం అసత్యమాడటం మానేస్తాము. తప్పనిసరిపరిస్థితిలోఆడాల్సిన అబద్ధాల వల్ల కలిగే పాపాన్ని కొంతమేరకు ప్రాయశ్చిత్తం వల్ల తగ్గించుకోవచ్చు.
అద్వైత వేదాంత పరిచయం
6.2.3 ప్రియం మృదువుగా :వాక్‌తపస్సులో మూడో అంశం యిది. దీనర్థం మన వాక్కు ప్రియంగా ఉండాలి. అంటే సున్నితంగా, మృదువుగా, మర్యాదగా, వినయంగా ఉండాలి. అంటే
మంగళ శబ్దాలు ఉండాలి. అమంగళ శబ్దాలు విడిచిపెట్టాలి.
అద్వైత వేదాంత పరిచయం
6.2.4 హితం ఇష్టం :మనం మాట్లాడేది వినే వ్యక్తికి హితంగా ఉండాలి. అంటే అతనికి యిష్టంగా ఉండాలి. అత్యంత దారుణమైన హింసల్లో ఒకటి, మనం చెప్పేదాని మీద శ్రద్ధలేనివానితో
మాట్లాడాల్సి రావటం. భరించలేని నిజం, సాధారణంగా, ఎవరికీ ఎదుటివారు చెప్పేది వినే ఓపిక ఉండదు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి