*అనుబంధం*
ముసలాయన రామయ్య. నాలుగు మెతుకులు తిని, అరుగు మీద కూర్చుని నలుగురి తో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలంగడిపే వాడు.
అది చూసిన పక్కింటి మన్నారుకు కన్ను కుట్టింది.
కొడుకు దగ్గరకు వచ్చి"మేపి ఆంబోతులా ఊరి మీదకు తరుముతున్నావు మీ నాయనను. రెండు బర్రెలు కొనిస్తే మేపుకురాడా ఇప్పుడు పాలు ఎంత ధరమ్ముతున్నాయి"అని గీరి వదిలి పెట్టాడు.
ఇంతకాలం నాకు ఇలాంటి మంచి ఆలోచన రాలేదని నుదురు కొట్టుకుని, చెప్పినంత పని చేశాడు.
కట్టదగ్గరకు తోలుకు పోయి ,మేపుకుని వచ్చేవాడు.
కొంత కాలానికి ఒక గేదె కట్టింది. సూడు మీదకు వస్తే మంచి ధరవస్తుందని , మేపుతున్నారు
మంచి వచ్చింది అమ్మి వేశారు . గేదె మెడకు తాడుకట్టి, కొన్నవారికి అప్పచెబుతున్నాడు. మిగిలిన గేదె కళ్ళలో నీళ్ళు ధారావాహికలా ప్రవహిస్తున్నాయి. కొన్నదాని కళ్ళల్లో కన్నీళ్ళు పొంగుతున్నాయి
వాటి అనుబంధం చూచి ముసలాయన ఏడుస్తున్నాడు. డబ్బులు లెక్కపెట్టుకునే సంబరంలో కొడుకు వాటిని గమనించనే లేదు.
మరుసటి ఏడు మరో గేదెను కూడా అమ్మేశారు.
ముసలాయన మళ్ళీ కాళీ అయ్యాడు.
ఇంట్లో కొడుకు కోడలు నస ఎక్కువైంది. వారి దెబ్బకు తాళలేక అలిగి మరో వూరికి వెళ్ళి పోయాడు.
వీధిలో కట్టి వేసివున్న గేదె ముసలాయనను చూచి తల వూపుతూ అరుస్తోంది. దగ్గరకు పోగా వళ్ళంతా నాకుతోంది గుర్తుకొచ్చింది ఇది మొదట అమ్మిన గేదని దాని ప్రేమకు తట్టుకోలేక ఈయన కూడా ఏడుపుకు మళ్ళాడు.
యజమాని వచ్చి ముసలాయనను గుర్తుపట్టాడు.
"తాతా!మేము వేరే వూరికి పోతున్నాము. దీనిని అమ్మివేయ దలచుకున్నాము" అన్నాడు.
"అయ్యా!దీనికి వయస్సు పోయింది. వేరే వారికి అమ్మితే దీనిని తినేవారికి అమ్మేస్తారు. నాకాలికి వెండి కడియం వుంది. ఇది ఎన్నడూ ఒక ఆభరణం అనుకో లేదు. ఇదీ నా శరీరంలో ఒక భాగం అనుకున్నాను . నా కట్టి తో కూడా కాలి పోతుందనుకున్నాను కాని, నేడు అమ్మవలసి వచ్చింది." అన్నాడు బాధగా.
"డబ్బులు అవసరం లేదు తీసుకుపో'----" అన్నాడు.
ఉన్న ఊరిలోనే కొడుక్కి దూరంగా, ఓ వసారా వేసుకుని, గేదెను చూసుకుంటూ ఇచ్చే పాలతో స్వేచ్ఛగా బ్రతక సాగాడు మన ముసలాయన.
✍🏻జంజం కోదండ రామయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి