5, నవంబర్ 2020, గురువారం

దర్శనం

 🦜గంటల తరబడి క్యూలో నిలుచొని ఉన్నప్పటికీ ఆ దేవుడిని దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుడిని ఒక ప్రశ్న వేసాడు. 


🦜డబ్బులేని భక్తులకు దూరం నుండి ..డబ్బులున్న భక్తుడికేమో దగ్గరి నుండి దర్శనం... ఎందుకయ్యా ఈ అన్యాయం ? ఇది ఏమైనా భావ్యంగా ఉందా??....🤔🤔


🦜గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. 


🦜తల్లికి మించిన దైవం లేదు అన్నాను...మీరు ఆవిడను పూజిస్తున్నారా?


🦜తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను...పాటిస్తున్నారా ??


గురువును మరొక దైవం అన్నాను...వినిపించు కున్నారా???


🦜ఇందులో ఉన్నా, అందులో ఉన్నా అని కాదు నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను...మీరు నమ్మారా????


🦜కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా?????


🦜నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్ని మీరే నిర్ణయించారు.  


🦜ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువులా నిలబెట్టారు.


🦜అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించడం న్యాయమా?????? అని.


*ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది*

🍏🍋🍊🍎🍓🍏.

కామెంట్‌లు లేవు: